About Me

ఎఫ్ 2 సెట్ లో అడుగుపెట్టిన " వెంకీ "..!

ఎఫ్ 2 సెట్ లో అడుగుపెట్టిన " వెంకీ "..!


 

వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో ఎఫ్ 2 అనే మల్టీ స్టారర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కొద్దీ రోజుల క్రితమే మొదలైంది. ఇది వరకు జరిగిన షూటింగ్ లో వరుణ్ తేజ్ పై మాత్రమే కొన్ని సీన్స్ ను తెరకెక్కించారు. ఇక రేపటి నుండి వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చే కూడా సీన్స్ ను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ జూలై 21 వరకు నిరవధికంగా జరగనుంది.

Venky Joins F2 Movie Shooting

 

ఎఫ్ 2 లో వెంకటేష్ పాత్ర ఫన్నీగా ఎంటర్ టైన్మెంట్ ను అందించేలా దర్శకుడు అనిల్ రూపొందించారు. ఈ ఏడాది చివరికల్లా టాకీ పార్ట్ షూటింగ్ ను పూర్తి చేసుకుని సంక్రాంతి నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. వెంకీకి జోడిగా మిల్క్ బ్యూటీ తమన్నా, వరుణ్ తేజ్ కు జోడిగా మెహ్రీన్ లు నటిస్తున్నారు. అనిల్ రావిపూడి పాత్రల నుండి హాస్యాన్ని పండించడంలో సిద్ధహస్తుడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చనుండగా, దిల్ రాజు నిర్మిస్తున్నారు.

Post a Comment

0 Comments