About Me

24 కిస్సెస్ తో రెచ్చిపోయిన హెబ్బాపటేల్

" 24 కిస్సెస్ " తో రెచ్చిపోయిన హెబ్బాపటేల్..!


హెబ్బా పటేల్..కుమారి 21ఎఫ్ చిత్రంతో తెలుగునాట కుర్రకారుకు నిద్రపట్టకుండా చేసిన హీరోయిన్. ఇప్పుడు తాజాగా అంతే ఇంటెన్స్ రొమాంటిక్ జోనర్ 24 కిస్సెస్ అనే సినిమాలో ఈ ముద్దు గుమ్మ నటించింది. గరుడవేగ సినిమాలో హ్యాకర్ పాత్రలో మెరిసిన ఆదిత్ హీరో గా ఈ చిత్రం తెరకెక్కింది. ఆయోధ్యకుమార్ కృష్ణమశెట్టి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.


ఇది వరకే షూటింగ్ పూర్తి కావడంతో ఇవాళే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ చూస్తే తెలుగు ప్రేక్షకులకు మరో కొత్త తరం ప్రేమకథ రాబోతోందని హింట్ ఇచ్చేలా ఉంది. ఇక రేపు సినిమా టీజర్ ను రిలీజ్ చేసి ప్రేక్షకుల్లోకి వెళ్లనున్నారు.

గతంలో ఈ దర్శకుడు మిణుగురులు అనే డిఫెరెంట్ సినిమాను తీసి క్రిటిక్స్ తో మంచి మార్కులే వేయించుకున్నాడు. ఇప్పుడు ఇలా జోనర్ మార్చి యువతకు సందేశమిచ్చే రీతిలో ఈ 24 కిస్సెస్ రూపొందించడంతో మంచి పాజిటివ్ హైప్ ఏర్పడింది. ఈ సినిమాను సిల్లీ మాంక్స్ సంస్థ నిర్మించింది.

Post a Comment

0 Comments