About Me

మహేష్ 25 లో హైలెట్స్ సీన్స్ ఇవ్వే...!

మహేష్ 25 లో హైలెట్స్ సీన్స్ ఇవ్వే...!


సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరియర్లోనే మైలురాయి లాంటి 25వ చిత్రాన్ని చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఇది వరకే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి కావడంతో త్వరలోనే విదేశాలకు వెళ్లి రెండో షెడ్యూల్ మొదలెట్టనున్నారు. డెహ్రడూన్ లో జరిగిన షూటింగ్ లో కాలేజీ బ్యాక్ డ్రాప్ లో సీన్స్ ను తెరకెక్కించారు.



ఈ రషెష్ చూసిన చిత్ర సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని చెప్తున్నారు. మహేష్ బాబు కుర్రాడి పాత్రలో గడ్డం లుక్ అదిరిపోయేలా కనిపిస్తున్నాడట. జోడిగా పూజ హెగ్డే కూడా బాగుందట. మహేష్ ఈ సినిమా కోసం లుక్ మొత్తం మార్చి ఫుల్ హెయిర్ తో, గుబురు గడ్డంతో దర్శనమివ్వనున్నాడు.


ఈ చిత్రంలో సెకండ్ హాఫ్ లో మహేష్ రైతుగా అవతారమెత్తనున్నాడు. తండ్రి కొడుకుల మధ్య అనుబంధాన్ని తెలిపేలా ఈ సినిమా ఉండనుంది. ఆగష్టు 9న మహేష్ పుట్టినరోజు కావడంతో ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసే అవకాశముంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వని దత్ లు సంయుక్తంగా నిర్మించనుండగా, వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఉగాది కానుకగా రిలీజ్ కానుంది.

Post a Comment

0 Comments