About Me

9 న వస్తున్నా రెడ్డిగారి అల్లుడు...?

9 న వస్తున్నా రెడ్డిగారి అల్లుడు...?


అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం శైలజ రెడ్డి అల్లు, సవ్యసాచి సినిమాలు చేస్తున్నాడు. సవ్య సాచి సినిమా ఆఖరి దశల్లో ఉంటూ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా గడుపుతోంది. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శైలజ రెడ్డి అల్లుడు చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ప్రమోషన్స్ ను మొదలెట్టింది. ఇందులో భాగంగానే జూలై 9న ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నామని చిత్రబృందం అధికారికంగా తెలిపింది.



ఓ రెండ్రోజుల క్రితం ఈ సినిమా ఫస్ట్ లుక్ పేరుతో ఓ పోస్టర్ బయటికి రాగా అది ఫేక్ అని చిత్రబృందం కొట్టి పారేసిన సంగతి తెలిసిందే. దర్శకుడు మారుతీ ఈ చిత్రాన్ని తనదైన శైలిలోనే ఎంటర్ టైన్మెంట్ ప్రధానాంశంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణ, చైతన్యకు అత్త పాత్రలో పవర్ ఫుల్ రోల్లో కనిపించనుంది. అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించింది. గోపి సుందర్ సంగీతం సమకూరుస్తుండగా, సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఎస్ రాధా కృష్ణ నిర్మిస్తున్నారు.

Post a Comment

0 Comments