About Me

నీ హద్దుల్లో నువ్వు ఉండు శంకర్... పవన్ ?

నీ హద్దుల్లో నువ్వు ఉండు శంకర్... పవన్ ?


 

కమెడియన్ గా షకలక శంకర్ కి మంచి పేరు ఉంది. అయితే కమెడియన్ నుంచి హీరోగా మారాడు షకలక శంకర్. అతను హీరోగా నటించిన “శంభో శంకర” ఇటీవలే విడుదలైంది. చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న శంకర్  తను విపరీతంగా అభిమానించే పవన్ కళ్యాణ్ గారు తనని ఒకసారి తిట్టినా సంగతి తెలిపాడు.
pawan Warning to Shankar


సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా సమయంలో ఒకే సీన్ చాలా సార్లు తీస్తున్న సమయంలో శంకర్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తో “ఏయ్‌! ఎన్నిసార్లు తీస్తావయ్యా షాట్‌..? క్లియర్‌గా చెప్పు? పదిసార్లు షాట్స్ తీస్తే ఎలా?”  అని కో-డైరెక్టర్‌తో కోపంగా తాను అన్నానని.. అయితే ఆ మాటలు విన్న పవన్‌ కళ్యాణ్..  శంకర్ ని పక్కకు పిలిచి “ఏరా! అప్పుడే నువ్వు కో-డైరెక్టర్లని.. డైరెక్టర్లకి సలహాలు ఇచ్ఛే రేంజ్‌కు వచ్చేశావా? వాళ్లు ఎన్నిసార్లు తీస్తే నీకెందుకు? ఏం చేస్తే నీకెందుకు? నీ హద్దుల్లో నువ్వు ఉండి చేసుకుని వెళ్లిపో” అన్నాడట. దీంతో తను కామ్ అయిపోయాడట. ఇక తనను ఆయన ఏమి అన్నా, అనకపోయినా పవన్ ని మాత్రం నేను దేవుడిలానే చూస్తానని చెప్పకొచ్చాడు శంకర్ .

Post a Comment

0 Comments