About Me

లేడీ ఓరియెంటెడ్ సినిమాలో సమంత...?

లేడీ ఓరియెంటెడ్ సినిమాలో సమంత...?


 

సమంత, వరుస విజయాలు సాధిస్తూ తెలుగు,తమిళ భాషల్లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్నారు. ఈ ఏడాది రంగస్థలం, మహానటి, అభిమన్యుడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం కన్నడలో ఘన విజయం సాధించిన యూ టర్న్ సినిమా రీమేక్ లో నటిస్తోంది. పవన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది.

Samantha In Lady Oriented Movie

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ముద్దు గుమ్మ త్వరలోనే లేడి ఓరిటెంటెడ్ సినిమా చేయనుంది. అర్జున్ రెడ్డి సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన గిరీశయ్య చెప్పిన కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతుండడంతో ఆగష్టు నుండి సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ఈ సినిమాను కైరోస్ కంటెంట్ సంస్థ నిర్మించనుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి. ప్రస్తుతం ఈ బ్యానర్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో మణికర్ణిక చిత్రం రూపొందుతోంది. 

 

Post a Comment

0 Comments