About Me

రివ్యూ: విజేత

రివ్యూ: విజేత 


 

Vijetha-Movie-Review

రివ్యూ: విజేత
రేటింగ్‌: 2.5/5
తారాగణం: కల్యాణ్ దేవ్‌, మాళవిక నాయర్‌,  మురళీ శర్మ, జయప్రకాష్‌, తనికెళ్ల భరణి, నాజర్ తదితరులు
సంగీతం: హర్షవర్దన్‌ రామేశ్వర్‌
నిర్మాత: సాయి కొర్రపాటి
దర్శకత్వం: రాకేష్‌ శశి

మెగా కాంపౌండ్ నుంచి ఎంత మంది హీరోలు వచ్చినా ఆదరిస్తున్నారు అనే కారణం వల్లనో లేక చూడ్డానికి బాగానే ఉన్నాడు కదా ఒక ప్రయోగం చేసి చూద్దామనే తలంపో తెలియదు కానీ విజేత సినిమా ప్రకటించినప్పటి నుంచి ప్రేక్షకుల్లో ఒకటే అనుమానం.

ఇప్పటి దాకా వచ్చిన హీరోలు ఏదోరకంగా ఆ కుటుంబ సభ్యులే. కానీ చిరు కూతురిని పెళ్లి చేసుకున్న కారణంగా అందులో సభ్యుడైన కళ్యాణ్ దేవ్ వాళ్ళలాగా మెప్పిస్తాడా అని. దానికి తోడు ట్రైలర్ పర్వాలేదు అనిపించుకున్న తరుణంలో పెద్దగా కాదు కానీ ఓ మోస్తరు అంచనాలు అయితే అభిమానుల్లో ఉన్నాయి.

అనగనగా ఒక తండ్రి. పేరు శ్రీనివాసరావు (మురళీశర్మ). కుటుంబం కోసం కష్టపడుతూ ఉంటాడు. అతనికో బాధ్యత లేని కొడుకు రామ్ (కళ్యాణ్ దేవ్). ఉద్యోగం రాలేదని స్వంతంగా ఒక కంపెనీ పెడితే అదీ ప్లాప్. దెబ్బకు నాన్నకు గుండెపోటు. హీరోకు కర్తవ్యం తెలిసి రంగంలోకి దిగుతాడు. దెబ్బ తీసిన కంపెనీని మళ్ళీ పెట్టి సక్సెస్ అందుకుంటాడు. తమ కోసం కెరీర్ ను వదులుకున్న నాన్నకు ఒక కానుక ఇస్తాడు. స్థూలంగా ఇదీ కథ.

ఇంత సింపులా అనకండి. విజేతలో ఉన్న కథ ఇదే. కాకపోతే దానికి కోటింగ్లు చాలా ఉన్నాయి. ముందు యాక్టర్స్ విషయానికి వద్దాం. కళ్యాణ్ దేవ్ చూడ్డానికి బాగానే ఉన్నాడు. కానీ యాక్టింగ్ పరంగా ఇంకా ఏబీసీ స్టేజి లోనే ఉన్నాడు. మెరుగుపడాల్సింది చాలా ఉంది. కాకపోతే శిక్షణ పుణ్యమా అని మరీ తీసికట్టుగా కాదు కానీ ఓ మాదిరిగా పరవాలేదు కుర్రాడు అనిపించుకుంటాడు. కానీ బాగా చేశాను అనిపించుకోవాలంటే ఇది సరిపోదు.

కథలో బలమైన ఎమోషన్స్ నింపారు కాబట్టి అతని లోపాలు అన్నీ పక్కకు వెళ్లిపోయాయి. ఇక హీరోయిన్ మాళవిక నాయర్ ఫస్ట్ హాఫ్ కే పరిమితం. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ లో కనపడుతుంది అంతే. ఇక విజేతలో అసలు హీరో మురళీ శర్మ. మధ్యతరగతి తండ్రి పాత్రలో జీవించేసాడు. కళ్యాణ్ దేవ్ కన్నా ఎక్కువ సెకండ్ హాఫ్ లో తనే కనిపిస్తాడు. కథ మొత్తం ఇద్దరి చుట్టే తిరుగుతుంది కాబట్టి తారాగణం చాలానే ఉన్నా ఎవరూ అంతగా గుర్తుండరు. తనికెళ్ళ భరణి, నాజర్ కొంతవరకు నయం.

దర్శకుడు రాకేష్ శశి ఫ్యామిలీ ఎమోషన్ ని తీసుకుని సేఫ్ గేమ్ ఆడాడు. కథలో నూతనత్వం ఏమీ లేదు. బాధ్యత ఉన్న తండ్రి, జులాయిగా తిరిగే కొడుకు లైన్ మీద ఇప్పటికే చాలా కథలు వచ్చాయి. కాకపోతే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా సన్నివేశాలు రాసుకున్న తీరు గొప్పగా కాదు కానీ విసుగు రాకుండా మెప్పిస్తుంది. అంత వరకు విజేతను మెచ్చుకోవచ్చు. అలా సాగిపోతుంది తప్ప ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశాలు అయితే ఇందులో లేవు.

డ్రామాను బాగా పండించిన రాకేష్ శశి…. కామెడీ విషయంలో మాత్రం అంతగా సక్సెస్ కాలేదు. కొన్ని సన్నివేశాల్లో తప్పించి అంతగా పండలేదు. మొదటి సినిమా ”జత కలిసే” కంటే బాగా హ్యాండిల్ చేయటం ఊరట. హర్షవర్ధన్ రామేశ్వర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు మూడు పాటలు బాగున్నాయి. సెంథిల్ కెమెరా విజేతకు ప్రధాన బలం. తన పనితనం వల్లే చాలా లోపాలు కప్పడిపోయాయి. వారాహి బ్యానర్ నిర్మాణ విలువల గురించి కొత్తగా రాయడానికి ఏమి లేదు. సబ్జెక్టు డిమాండ్ మేరకు పెట్టారు.

ఇక ఫైనల్ గా చెప్పాలంటే విజేత 2018 అప్పట్లో వచ్చిన చిరంజీవి విజేత ఛాయల్లోనే తండ్రిని మెప్పించేందుకు తాపత్రయపడే కొడుకు కథ. అంతే. హీరో కన్నా… అతని చుట్టూ ఉన్న పాత్రల నుంచి బలమైన సన్నివేశాల నుంచి క్వాలిటీ రాబట్టుకున్న రాకేష్ శశి…. కథకుడిగా మాత్రం రొటీన్ గానే కనిపించాడు.

తండ్రి కొడుకుల సెంటిమెంట్ మీద ఎన్ని సినిమాలు వచ్చినప్పటికీ అవి సక్సెస్ కావాలంటే హత్తుకుపోయే ఎమోషన్ చాలా అవసరం. దాన్ని అందించడంలో విజేత కొంత వరకు విజయం సాధించింది. ఇలాంటివి గతంలో చూసామే అనే ఫీలింగ్ కలిగినప్పుడు మాత్రం విజేత రొటీన్ గా అనిపిస్తుంది. అది మినహాయించి రాకేష్ శశి కథతో ప్రయాణం చేస్తే మాత్రం పర్వాలేదు అనుకుని రిలీఫ్ ఇస్తాడు. ఇది ఫక్తు మెగా బ్రాండ్ సినిమా మాత్రం కాదు.

 

 

Post a Comment

4 Comments

 1. I love what you guys are up too. This type of clever work and reporting!
  Keep up the superb works guys I've added you guys to blogroll. http://www.mbet88vn.com

  ReplyDelete
 2. I love what you guys are up too. This type of clever work and reporting!

  Keep up the superb works guys I've added you guys to blogroll. http://www.mbet88vn.com

  ReplyDelete
 3. Yes! Finally someone writes about roasted coffee. http://xue.medellin.unal.edu.co/grupois/wiki/index.php/User:AmeeParas18952

  ReplyDelete
 4. Evening household devotions had been one of the vital components
  of Lee and Larry?s day. Daddy learn a part of the story of Jesus coming at
  Christmas which is the place he learn yearly throughout December
  so they would know the actual purpose for Christmas, to have fun the beginning of Jesus.
  On the end of it, Lee requested, ?Daddy, did Jesus get a celebration every year
  with presents and a clown too?

  ReplyDelete