About Me

రివ్యూ: చినబాబు

రివ్యూ: చినబాబు


 

China Babu Movie Review

రివ్యూ: చినబాబు

రేటింగ్‌: 3/5
తారాగణం: కార్తి,ప్రియా భవానీ శంకర్,సయేషా సైగల్,సూరీ,భానుప్రియ,సత్యరాజ్
సంగీతం: డి ఇమ్మాన్
నిర్మాత: సూర్య శివకుమార్ ,మిర్యాల రవింద్రర్ రెడ్డి
దర్శకత్వం: పాండిరాజ్

 

తెలుగులో మంచి మార్కెట్ ఉన్న తమిళ నటుల్లో ఒకరు. గతంలో ఆయన నటించిన యుగానికి ఒక్కడు, ఆవారా, నా పేరు శివ, ఖాకీ లాంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. నాగార్జునతో కలిసి ఊపిరి మూవీలో నటించిన కార్తి.. తాజాగా ‘చినబాబు’గా మన ముందుకొచ్చారు. తమిళంలో ‘కడియకుట్టి సింగం’ పేరిట విడుదలైన ఈ మూవీ తెలుగులో ఎలా ఉంది..? కుటుంబ కథా చిత్రంతో మన ముందుకొచ్చిన కార్తి హిట్ కొట్టారా..? సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

పెనుగొండ రుద్రరాజు (సత్యరాజ్)ది జమీందారీ కుటుంబం. ఆయన మొదటి భార్య మాధవి (విజి చంద్రశేఖర్)కు ఆడ పిల్లలే కావడంతో మగ సంతానం కోసం ఆమె చెల్లెలయిన భార్గవి (భానుప్రియ)ను పెళ్లి చేసుకుంటాడు. ఇద్దరికీ ఐదుగురు ఆడపిల్లలు పుట్టిన తర్వాత మాధవికి కొడుకు (కార్తి) జన్మిస్తాడు. ఐదుగురు అక్కల ముద్దుల తమ్ముడైన చినబాబు తండ్రిలాగే వ్యవసాయం చేస్తుంటాడు. అక్కల ఆప్యాయతల మధ్య పెరిగిన చినబాబు తన ఇద్దరు మేనకోడళ్లను కాదని మరో అమ్మాయిని ప్రేమిస్తాడు. వేరే అమ్మాయితో పెళ్లికి అక్కలు, బావలను ఎలా ఒప్పించగలిగాడు..? కుటుంబ సభ్యుల మధ్య వచ్చిన విబేధాలను ఎలా పరిష్కరించాడనేదే ఈ చిత్ర కథ.

ఎద్దుల పందెం సీన్‌తో చినబాబుగా కార్తి పాత్ర పరిచయం అవుతుంది. అప్పుడప్పుడే రాజకీయాల్లో ఎదుగుతోన్న సురేంద్ర రాజు (శ్రతు)కు చినబాబు పందెంలో గెలవడం నచ్చదు. తమ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడనే కారణంతో చినబాబుకు చదువు చెప్పిన మాస్టారు కొడుకును సురేంద్ర రాజు చంపేస్తాడు. ఈ కేసు కారణంగా అతడు ఊరికి దూరం అవుతాడు. దీనికి కారణమైన చినబాబుపై కక్ష పెంచుకుంటాడు.

అదే సమయంలో చినబాబు ఓ రోజు బస్సులో అనూహ్యంగా హీరోయిన్ నీల నీరధ (సయేషా సైగల్‌)ను చూస్తాడు. తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె సురేంద్ర రాజు బంధువే కావడంతో.. చినబాబును ఎలాగైనా చంపేయాలని సురేంద్ర భావిస్తాడు. సురేంద్ర రాజు వ్యూహాలను చినబాబు ఎలా తిప్పికొట్టాడు. తన పెళ్లి కోసం ఇంట్లో వాళ్లను ఎలా ఒప్పించాడనేది తెర మీద చూడాల్సిందే.

ఉమ్మడి కుటుంబ అనుబంధాల నేపథ్యంలో తెలుగులో బోలెడు సినిమాలొచ్చాయి. ఫ్యామిలీ సెంటిమెంట్‌కు కాస్త హాస్యం జోడించి ప్రేక్షకులను కనెక్ట్ చేయగలిగితే చాలు సినిమా హిటయినట్టే. చినబాబు కూడా ఇదే కోవకు చెందుతుంది. ఇంట్లో పెరిగిన అక్క కూతురో లేదంటే మేనమామ కూతురునో కాదని బయటి అమ్మాయిని పెళ్లాడితే కుటుంబంలో ఏ సమస్యలు తలెత్తుతాయనే కథాంశంతో దర్శకుడు పాండిరాజ్ ఈ సినిమాను ఆకట్టుకునేలా తెరకెక్కించారు.

ఆడియెన్స్‌ను సినిమాలో లీనమయ్యేలా చేయడంలో డైరెక్టర్ విజయం సాధించాడు. తొలి అర్ధభాగంలో ఫర్వాలేదనిపించిన ‘చినబాబు’ రెండో అర్ధభాగంపై అంచనాలు పెంచేలా ఇంటర్వెల్ బ్యాంగ్‌తో ముగుస్తుంది. తన పెళ్లి కోసం ఐదుగురు అక్కలు, బావలను ఒప్పించడానికి చినబాబు పడిన ప్రయత్నం కొన్ని సందర్భాల్లో నవ్విస్తే, మరికొన్ని సందర్భాల్లో కంటతడి పెట్టిస్తుంది.

వ్యవసాయం చేసే రైతు పాత్రలో చినబాబు పాత్రలో కార్తి ఒదిగిపోయారు. అతడి తండ్రిగా సత్యరాజ్ చక్కటి నటన కనబరిచారు. చినబాబు మేనల్లుడిగా, ఎప్పుడూ అతణ్నే అంటిపెట్టుకుని తిరిగే స్నేహితుడిగా సూరీ ఆకట్టుకున్నారు. చినబాబు ప్రేయసిగా సయేషా ఫర్వాలేదనిపించింది. తను ఎంతో ప్రేమించిన ఎద్దులు చనిపోయిన సమయంలో వేదన పడే రైతుగా కార్తి నటన బాగుంది. ప్రిక్లమాక్స్‌లో చినబాబు తల్లిగా మాధవి పాత్రలో విజీ చంద్రశేఖర్ చెప్పే డైలాగ్‌లతో కళ్లు చెమరుస్తాయి.

విలన్‌గా తన ఫరిధి మేరకు తెలుగు నటుడైన శత్రు బాగా నటించారు. మిగతా నటీనటులంతా తమ పాత్రకు న్యాయం చేశారు. ఏ క్యారెక్టర్ కూడా అతిగా అనిపించలేదు. నటులంతా తమిళ వాళ్లే కావడం, తమిళ వాసనలు ఎక్కువగా ఉండటం లాంటి నెగటివ్ పాయింట్స్ ఉన్నా.. చక్కటి కథనం ముందు అవి పెద్దగా కనిపించలేదు.

పల్లెటూరి వాతావరణంలో చినబాబును అందంగా తెరకెక్కించారు. తమిళంలో ఈ చిత్రాన్ని నిర్మించిన హీరో సూర్య.. తన తమ్ముడికి మంచి హిట్ అందించారు. డబ్బింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సినిమాటోగ్రాఫర్ ఆర్. వేల్‌ రాజ్ పనితనం బాగుంది. రూబెన్ ఎడిటింగ్ వర్క్‌ను మెచ్చుకొని తీరాల్సిందే. 

కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు, ఆప్యాయతలు, చిన్ని చిన్న వివాదాల నేపథ్యంలో తెరకెక్కిన ‘చినబాబు’ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కట్టిపడేస్తాడు. సినిమా విడుదలకు ముందు కార్తి చెప్పినట్టు ఈసారి సంకాత్రి పండుగ ముందే వచ్చింది.

Post a Comment

2 Comments

 1. Just desire to say your article is as astonishing. The clearness to
  your submit is just excellent and i could think you are
  a professional on this subject. Well with your permission let me to grab your feed to stay up
  to date with forthcoming post. Thank you 1,000,000 and please keep up the gratifying work. http://al24.ru/goto.php?goto=http://www.mbet88vn.com

  ReplyDelete
 2. Just desire to say your article is as astonishing. The clearness to your submit is just excellent and i could think you are a professional on this subject.

  Well with your permission let me to grab your feed to stay up
  to date with forthcoming post. Thank you 1,000,000 and
  please keep up the gratifying work. http://al24.ru/goto.php?goto=http://www.mbet88vn.com

  ReplyDelete