About Me

అక్కినేని స‌మంత‌కు అరుదైన అవార్డ్‌...?

అక్కినేని స‌మంత‌కు అరుదైన అవార్డ్‌...?


 

2018 స‌మంత‌కు ల‌క్కీయెస్ట్ ఇయ‌ర్ అని చెప్పాలి. ఈ ఏడాదిలో వ‌రుస‌గా రంగ‌స్థ‌లం, మ‌హాన‌టి, అభిమ‌న్యుడు వంటి సంచ‌ల‌న విజ‌యాలు అందుకున్న చిత్రాల్లో భాగ‌స్వామి అయ్యింది. అంతేకాదు.. ఆయా చిత్రాల్లో సామ్ న‌ట‌న‌కు ప్ర‌త్యేకించి గుర్తింపు ద‌క్కింది. రంగ‌స్థ‌లంలో రామ‌ల‌క్ష్మిగా, మ‌హాన‌టిలో మ‌ధుర‌వాణి అనే అమాయ‌క జ‌ర్న‌లిస్టుగా న‌టించి మెప్పించింది సామ్‌. డిజిట‌ల్ ప‌ర్య‌వ‌సానాల‌పై తీసిన `అభిమ‌న్యుడు` సినిమాలో విశాల్‌కి మైండ్ సెట్ చేసే సైక్రియాటిస్టుగా న‌టించింది. ఆ క్ర‌మంలోనే అవార్డు క‌మిటీల క‌న్ను స‌మంత‌పై ప‌డింది.

samantha-akkineni-nominate-iffm-awards

లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. `మ‌హాన‌టి`లో స‌హాయ‌క పాత్ర‌కు ప్ర‌తిష్ఠాత్మ‌క‌ మెల్‌బోర్న్(ఆస్ట్రేలియా) ఐఎఫ్ఎఫ్ఎం 2018 అవార్డుల‌కు సామ్ పేరు నామినేట్ అయ్యింద‌ని తెలుస్తోంది. సావిత్రి జీవితంపై ప‌రిశోధించే జ‌ర్న‌లిస్టు మ‌ధుర‌వాణిగా స‌మంత అభినయం ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే.

బాలీవుడ్ నుంచి సంజు చిత్రంలో న‌టించిన విక్కీ కౌశ‌ల్, సీక్రెట్ సూప‌ర్‌స్టార్‌లో న‌టించిన మెహ‌ర్ విజ్‌, ల‌వ్ సానియా చిత్రంలో న‌టించిన రిచా చ‌ద్దాలు స‌హాయ న‌టి నామినీల జాబితాలో ఉన్నారు. ఇక రంగ‌స్థ‌లం, మ‌హాన‌టి సినిమాల్లో న‌ట‌న‌కుగానూ స‌మంత‌కు జాతీయ పుర‌స్కారం ద‌క్కుతుందంటూ మ‌రోవైపు ప్ర‌చారం సాగుతోంది. ఒక్కో పుర‌స్కారం.. సామ్‌లో ఉత్సాహం పెంచుతాయ‌న‌డంలో సందేహం లేదు.

Post a Comment

0 Comments