About Me

చిన్న హీరోలే బెటర్ అంటున్న కాజల్... ఎందుకో..?

చిన్న హీరోలే బెటర్ అంటున్న కాజల్... ఎందుకో..?


 

గత ఏడాది ఖైదీ నెంబర్ 150లో చిరంజీవి సరసన చేసినప్పుడు అవకాశాలు తగ్గిపోయాయి కాబట్టి సీనియర్ హీరోలకు కూడా కాజల్ అగర్వాల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది అనే టాక్  బలంగా వచ్చింది. దానికి తగ్గట్టు రానాతో చేసిన నేనే రాజు నేనే మంత్రి తప్ప ఇంకే సినిమా రాలేదు. కానీ అనూహ్యంగా కాజల్ మళ్ళి ఫామ్ లోకి వచ్చేస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో రెండు సినిమాల్లో జోడి కట్టిన కాజల్ తాజాగా విజయ్ దేవరకొండ సరసన నటించే ఛాన్స్ ఉందంటూ ఫిలిం నగర్లో గట్టి టాకే నడుస్తోంది.

Kajal comfort with small heros

ఓనమాలు,మళ్ళి మళ్ళి రాని రోజు లాంటి సెన్సిబుల్ సినిమాల దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నిర్మాత కెఎస్ రామారావు నిర్మించే సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ను తీసుకునే నిర్ణయం జరిగిందని వినికిడి. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానప్పటికీ నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఓకే అయితే కాజల్ మంచి ఛాన్స్ కొట్టేసినట్టే.

ప్రస్తుతం క్వీన్ తమిళ్ రీమేక్ లో నటిస్తున్న కాజల్ చాలా కాలంగా దాని విడుదల కోసం ఎదురు చూస్తోంది. తమన్నాతో తీస్తున్న తెలుగు వెర్షన్ ఒరిజినల్ దర్శకుడు నీలకంఠతో ఏదో సమస్య రావడం వల్ల ఇటీవలే దాన్ని అ!! ఫేమ్ ప్రశాంత్ వర్మ టేకప్ చేసిన సంగతి తెలిసిందే. అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని వేగంగా షూటింగ్ చేస్తున్నారు.

కాజల్ ని క్వీన్ లో మనం చూసే ఛాన్స్ లేదు కానీ తమిళ్ వస్తే చూసుకోవచ్చు. మొత్తం మూడు సినిమాలలో కుర్ర హీరోల పక్కన ఆఫర్లు కొట్టేసిన కాజల్ అగర్వాల్ మళ్ళి రేస్ లోకి వచ్చినట్టే. పదేళ్ల సీనియారిటీ ఉన్న కాజల్ ఇలా మైంటైన్ చేయటం చిన్న విషయం కాదు. ఒకపక్క తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి సమఉజ్జిలు వెంకటేష్ సరసన చేయడానికి రెడీ అవుతుంటే కాజల్ కు విజయ్ దేవరకొండ లాంటి క్రేజీ యూత్ హీరో సరసన అవకాశం రావడం అంటే విశేషమే.

Post a Comment

0 Comments