About Me

ఎన్టీఆర్ " అరవింద " టీజర్ వచ్చేస్తుంది...?

ఎన్టీఆర్ " అరవింద " టీజర్ వచ్చేస్తుంది...?



ఎన్టీఆర్ అరవింద సమేత సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. అజ్ఞాతవాసి పరాజయం నుంచి బయటపడేందుకు త్రివిక్రమ్ ఈ సినిమాను కసితో చేస్తున్నాడు. అప్పటిలా ఆలస్యం చేయకుండా, సినిమాను పక్కాగా ప్లాన్ చేసి షూట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన త్రివిక్రమ్, ఆగష్టు 15 న ఫస్ట్ టీజర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వర్క్ ఇప్పటికే ప్రారంభమైంది. అంతేకాదు, ఈ సినిమాకు సంబంధించి టీజర్, ట్రైలర్, ఆడియో విడుదల తేదీలను కూడా త్వరలోనే ఫిక్స్ చేయనున్నారు.


త్వరలోనే వరంగల్ షెడ్యూల్ స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ వరకు సినిమాను పూర్తి చేసి, అక్టోబర్ లో దసరా కానుకగా అక్టోబర్ 10 లేదా 11 వ తేదీన సినిమా విడుదల చేయాలని త్రివిక్రమ్ ప్లాన్. ఆగష్టు 15 న ఫస్ట్ టీజర్ రిలీజ్ కాబోతుందని తెలియడంతో ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు.

Post a Comment

0 Comments