About Me

అనుష్క తో జతకట్టనున్న నాచురల్ స్టార్ నాని..?

అనుష్క తో జతకట్టనున్న నాచురల్ స్టార్ నాని..?


 

తెలుగులోని వైవిధ్య దర్శకుల్లో అగ్రస్థానంలో నిలిచే దర్శకులు చంద్రశేఖర్ యేలేటి. ఆయన తీయబోయే తదుపరి చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే కథ చర్చలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం నటీనటుల ఎంపికలో బిజీగా ఉంది.
nani act in anushka movie


ఇదిలా ఉండగా మొదట ఈ చిత్రంలో నితిన్ నటిస్తున్నాడంటూ కొన్ని వార్తలు వచ్చాయి. అయితే నితిన్ ప్రస్తుతం “శ్రీనివాస కళ్యాణం” “భీష్మ” చిత్రాలతో బిజీగా ఉండడంతో ఈ చిత్రంలో హీరోగా న్యాచురల్ స్టార్ నాని నటించబోతున్నాడనే వార్తలు ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తున్నాయి.

ఇదిలా ఉండగా ఈ చిత్రం చందు అనుష్క కోసం రాసుకున్నాడని, అనుష్క ప్రధాన పాత్రలో సాగే ఈ సినిమాలో నాని ఒక కీలకపాత్రలో కనిపించనున్నాడనే టాక్ కూడా వినిపిస్తుంది. అయితే అనుష్క, నాని లిద్దరివి ప్రధాన పాత్రలే కావడంతో ఇద్దరూ కలిసి నటిస్తున్నారనే వార్త కూడా ఉంది.ఏది ఏమైనా చందు అధికారికంగా ప్రకటించే వరకు ఈ సినిమాలో నటించేది ఎవరనే దానిపై క్లారిటీ వచ్చేలా లేదు.

Post a Comment

0 Comments