About Me

రివ్యూ: ఈ నగరానికి ఏమైంది

రివ్యూ: ఈ నగరానికి ఏమైంది


Ee Nagaraniki Emaindi Movie Review

రివ్యూ: ఈ నగరానికి ఏమైంది?
రేటింగ్‌: 3/5
తారాగణం: సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమఠం, విశ్వక్ సేన్ నాయుడు, వెంకటేష్ కాకుమాను, సిమ్రన్ చౌదరి, అనీషా ఆంబ్రోస్ తదితరులు
సంగీతం: వివేక్‌ సాగర్‌
నిర్మాత: సురేష్‌ బాబు
దర్శకత్వం: తరుణ్‌ భాస్కర్‌


టాలీవుడ్ కూడా సాంప్రదాయ సినిమా పద్ధతికి భిన్నంగా నూతన దర్శకులు ప్రయోగాలు చేయటం మంచిదే కానీ ప్రాంతీయ సినిమా ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గట్టుగా మలిచినప్పుడే వీటికి సక్సెస్ దక్కుతుంది. అప్పుడప్పుడు అలాంటి సినిమాలు వస్తున్నా రిస్క్ ఎందుకులే అనే ఉద్దేశంతో రెగ్యులర్ గా మాత్రం రావడం లేదు.

మొదటి సినిమా పెళ్లి చూపులతో తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్…. అందరు కొత్త కుర్రాళ్లతో చేసిన మూవీ ”ఈ నగరానికి ఏమైంది”. సురేష్ సంస్థ కావడంతో మార్కెటింగ్ విషయంలో తీసుకున్న శ్రద్ధ వల్ల ప్రేక్షకుల్లో ముఖ్యంగా యూత్ లో ఇది ఓ మాదిరి అంచనాలు అయితే రేపగలిగింది.

సినిమా అంటే పిచ్చి ఉన్న నలుగురు కుర్రాళ్ళ కథ ఇది. కార్తీక్ (సుశాంత్ రెడ్డి), వివేక్(విశ్వక్ సేన్ నాయుడు), ఉపేంద్ర(వెంకటేష్), కౌశిక్(అభినవ్) కాలేజీ వయసు నుంచే ఫిలిం మేకింగ్ మీద సీరియస్ గా ఉంటారు. వివేక్ కు షార్ట్ ఫిలిం హీరోయిన్ శిల్ప(సిమ్రన్ చౌదరి)తో లవ్ ఎఫైర్ మొదలై బ్రేక్ అప్ దాకా వస్తుంది.

ఒక షార్ట్ ఫిలిం పోటీకి ఆకర్షణీయమైన బహుమతి ఉండటంతో అందరూ కలిసి గోవా బయలుదేరతారు. థ్రిల్లర్ తీద్దామని కార్తీక్, వద్దు రొమాంటిక్ తీద్దామని మిగిలిన ముగ్గురు ఇలా చర్చల్లో ఉండగానే యాక్సిడెంట్ అవుతుంది. మరోవైపు కార్తీక్ కు ఒక లవ్ స్టోరీ ఉంటుంది. దానికి లింక్ కూడా ఫిలిం కాంటెస్ట్ తోనే ముడిపడి ఉంటుంది. మరి వీళ్ళ గమ్యం ఎలా రీచ్ అయ్యారు? వర్తమానానికి, భవిష్యత్తుకి ఈ నలుగురికి లింక్ ఎలా కుదిరింది? అనేదే అసలైన కథ.

నలుగురు కుర్రాళ్ళు హుషారుగా ఉన్నారు. ఆకలి రాజ్యం, రెండు జెళ్ళ సీత, హ్యాపీ డేస్ లాంటి యూత్ ఫుల్ సినిమాల కోవలోకి ఇది రాదు కానీ డిఫరెంట్ జానర్ లో ప్రయత్నించడం వల్ల టెక్నీకల్ గా బ్రిలియంట్ అనిపించినా సినిమాలో నటీనటులకు ఎక్కువ స్కోప్ దక్కలేదు. విశ్వక్ సేన్ కు మంచి అవకాశం దక్కింది. నిలబెట్టుకునే ప్రయత్నం చేసాడు. సాయి శశాంక్ బాగానే చేసాడు కానీ ఇంకా మెరుగుపడాల్సింది చాలా ఉంది. అభినవ్, వెంకటేష్ నవ్వించే బాధ్యతను బాగానే నిర్వర్తించారు. హీరోయిన్లు సిమ్రాన్, అనీషా అంబ్రోస్ గ్లామర్ పరంగా, యాక్టింగ్ పరంగా అంత అవకాశం దక్కలేదు కానీ జస్ట్ ఓకే అనిపించారు. కథ మొత్తం ఈ ఆరుగురు చుట్టే తిప్పడంతో మిగిలినవాళ్లకు అంత స్కోప్ దక్కలేదు

తరుణ్ భాస్కర్ హాలీవుడ్ ప్లస్ బాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో కథ రాసుకున్నట్టు ముందే ఒప్పేసుకున్నాడు. ఆ ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి. యూత్ ని నవ్వించి మెప్పించడమే టార్గెట్ గా పెట్టుకుని తీసిన తరుణ్ భాస్కర్ మరీ సీరియస్ గా కథనం మీద ఫోకస్ పెట్టలేదు. అందువల్ల ఫ్రెండ్స్ మధ్య జరిగే తతంగం ఎంత నవ్వించినా ఎమోషనల్ గా మాత్రం కనెక్ట్ కాలేకపోయింది.

అలా లైటర్ వీన్ కామెడీ తో బండి లాగించే ప్రయత్నం చేయటం వల్ల ఇలాంటి వాటికి కనెక్ట్ అయ్యే యూత్ తప్ప సాధారణ ప్రేక్షకులు అంతగా మెచ్చకపోవచ్చు. అయినా కూడా ఈ నగరానికి ఏమైంది బాగాలేదు అని కాదు. చాలా బాగుంది అనే కామెంట్ ను మాత్రం మనస్పూర్తిగా అనిపించుకోవడంలో పూర్తిగా సక్సెస్ కాలేదు.

పెళ్లి చూపులు జానర్ కాకపోయినా దాని స్థాయిలో సగం మాత్రమే ఉందీ మూవీ. నికేత్ కెమెరా పనితనం మంచి స్టాండర్డ్ లో ఉంది. వివేక్ సాగర్ సంగీతం ప్లస్ అయ్యింది. ఇలాంటి సినిమాలకు ఎలాంటి సంగీతం కావాలో అలాంటిది సెట్ చేసుకుని ఇచ్చాడు కనక తనవరకు పాస్ అయ్యాడు. రవితేజ గిరజాల ఎడిటింగ్ కూడా నీట్ గా ఉంది. ఎక్కువ లెంగ్త్ రాకుండా మేనేజ్ చేసాడు కానీ కథనంలో లోపాల వల్ల కొన్నిచోట్ల నిస్సహాయుడిగా మిగిలాడు. సురేష్ సంస్థ కనక బడ్జెట్ విషయంలో రాజీ ఉండదు. అయినా దీనికి అవసరమైనంత ఇచ్చేసారు. కథ డిమాండ్ చేయలేదు కాబట్టి ఖర్చూ తక్కువే.

చివరిగా చెప్పాలంటే ఈ నగరానికి ఏమైంది యూత్ ని మాత్రమే టార్గెట్ చేసిన ఒక కామెడీ ఎంటర్ టైనర్. కుర్రాళ్ళ మధ్య ఉండే ఫన్ ని షార్ట్ ఫిలిం అనే కాన్సెప్ట్ కి లింక్ చేసిన తీరు బాగుంది. Ee Nagaraniki Emaindi Movie Review

ఈ నగరానికి ఏమైంది – కామెడీ మాత్రమే నిలిచింది.

Post a Comment

0 Comments