About Me

కాస్టింగ్ కౌచ్ పై కాజల్ స్పందన ఏంటి..?

కాస్టింగ్ కౌచ్ పై కాజల్ స్పందన ఏంటి..?


kajal-aggarwal-about-casting-couch-issue
 



గత కొన్ని రోజులుగా తెలుగు పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిన అంశం కాస్టింగ్ కౌచ్.  శ్రీరెడ్డి లాంటి ఆర్టిస్టులు బయటికొచ్చి కొందరు పెద్దల పేర్లు బయటపెట్టడం, చికాగో ఉదంతం బట్టబయలు కావడంతో ఈ అంశం అందరి దృష్టికీ వెళ్ళింది.  ప్రేక్షకులు చాలా మంది ఈ కాస్టింగ్ కౌచ్ ఊబిలో చిన్న చిన్న నటీమణులే కాకుండా బడా హీరోయిన్లు కూడా ఉన్నారనే అభిప్రాయంలోకి వెళ్లిపోయారు.

ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ కాస్టింగ్ కౌచ్ వలన తనకెలాంటి ఇబ్బందీ కలగలేదని, పరిశ్రమలో అందరూ  చెడ్డవాళ్లే ఉండరని కొంత క్లారిటీ ఇవ్వగా తాజాగా మరొక స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా కాస్టింగ్ కౌచ్ పై స్పందించారు.  నిన్న  వరంగల్ లో ఒక మొబైల్ షోరూమ్ ప్రారంభోత్సవానికి వెళ్లిన కాజల్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ తనకు కాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదురవలేదని అన్నారు.

అలాగే పరిశ్రమలోకి వచ్చే అమ్మాయిలంతా అన్ని విషయాలపై పూర్తి అవగాహనతో ఉండాలని, పురుషులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సలహా ఇచ్చారు.  ఇక పెళ్లి విషయం ప్రస్తావనకు రాగానే ఎప్పటిలాగే అది ఇంట్లో వాళ్ళ ఇష్టమంటూ సమాధానమిచ్చారు.

Post a Comment

0 Comments