About Me

సెన్సార్ పూర్తి చేసుకున్న "లవర్ "

సెన్సార్ పూర్తి చేసుకున్న "లవర్ "


 

రాజ్ తరుణ్, రిద్దీ కుమార్ జంటగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ సమర్పణలో హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం “లవర్”. “అలా ఎలా?” ఫేమ్ అయిన అనీష్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు.ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని జులై 20న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఈరోజు సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి “యూ/ఏ” సెర్టిఫికెట్ ను జారీ చేసింది.

Raj Tarun Lover Censor report

ఇక ఈ చిత్రంలో రాజ్ తరుణ్ ”రాజ్” అనే బైక్ డిజైనర్ పాత్రలో కనిపించనుండగా…. హీరోయిన్ రిద్ధికుమార్ ”చరిత్ర” అనే కాలేజీ యువతి పాత్రలో కనిపిస్తోంది. ఇక ఆరుగురు సంగీత దర్శకులు సంగీతం సమకూర్చిన ఈ చిత్ర పాటలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటున్న తరుణంలో ఈ చిత్రంపై పాజిటివ్ టాక్ మొదలవుతోంది.

గతకొద్దీ కాలంగా భయంకరమైన డిజాస్టర్స్ తో కెరీర్ పరంగా గడ్డుకాలాన్నిఎదుర్కొంటున్న రాజ్ తరుణ్ ఈ సినిమాతోనైనా విజయం సాధించి మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. మరి అతని ఆశలు ఈ సినిమాతోనైనా నెరవేరుతాయో లేదో చూడాలి.

Post a Comment

2 Comments

  1. We are a gaggle of volunteers and starting a
    new scheme in our community. Your website provided us with helpful
    info to work on. You have done an impressive task and
    our entire neighborhood will probably be grateful to you. https://gamergen.com/redirect/?url=http://alternatif188bet.com

    ReplyDelete
  2. We are a gaggle of volunteers and starting a new scheme in our community.

    Your website provided us with helpful info to work on. You have done an impressive task and our entire neighborhood will
    probably be grateful to you. https://gamergen.com/redirect/?url=http://alternatif188bet.com

    ReplyDelete