About Me

వైరల్ గా మరీనా చరణ్-ఉపాసన జిమ్ వీడియో..?

వైరల్ గా మరీనా చరణ్-ఉపాసన జిమ్ వీడియో..?


https://www.youtube.com/watch?v=RDU_nzP0zkU

రామ్ చరణ్, ఉపాసనలు ఫిట్ నెస్ పై దృష్టి సారించారు.  ఎక్కడున్నా సరే క్రమం తప్పకుండా ఈ ఇద్దరు జిమ్ లో వర్కౌట్ చేస్తుంటారు.  ఇటీవలే హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్ కార్యక్రమంలో కూడా పాల్గొని ఫిట్ నెస్ ను నిరూపించుకున్నారు.  రామ్ చరణ్ .. బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.  మరోవైపు ఈ హీరో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చారిత్రాత్మక సినిమా సైరాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

charan and upasana gym video

ఇలా రెండు పనులతో బిజీగా ఉన్న ఈ హీరో.. మానసికంగా, శారీరకంగా ఫిట్ గా ఉండేందుకు చరణ్ భార్య ఉపాసన స్పెషల్ కేర్ తీసుకుంటుంది.  ఇందులో భాగంగానే అపోలో లో ఏర్పాటు చేసిన స్పెషల్ జిమ్ స్టూడియోలో ఈ ఇద్దరు వర్కౌట్ చేస్తుంటారు. చరణ్, ఉపాసనలు వర్కౌట్ చేస్తున్న వీడియోను ఉపాసన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.  ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

Post a Comment

0 Comments