About Me

ఆసక్తి కలిగిస్తున్న ఓ చిన్న సినిమా పోస్టర్..?

ఆసక్తి కలిగిస్తున్న ఓ చిన్న సినిమా పోస్టర్..?


 

ఈ ఏడాది సుమంత్ హీరోగా వచ్చిన “మళ్ళీరావా” చిత్రాన్ని నిర్మించి మంచి విజయాన్ని అందుకున్న స్వధరమ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో రాహుల్ నిర్మాణ లో తెరకెక్కుతున్న చిత్రం “AGENT సాయి శ్రీనివాస ఆత్రేయ”.

agent-sai-srinivasa-athreya-first-poster

ఈ చిత్రం ద్వారా స్వరూప్ అనే నూతన దర్శకుడు పరిచయం కాబోతున్నాడు. తాజాగా ఈ చిత్ర యూనిట్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. నెల్లూరు నగరంలోని ఒక షాప్ షట్టర్ పైన చిత్ర పేరును రాసి చూపించారు. చాలా ఆసక్తిగా ఉన్న ఈ పోస్టర్ పై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

పూర్తి స్థాయి క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి, శృతి శర్మలు…. హీరో, హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోకి మళ్లేందుకు సిద్ధమైంది. ఈ సినిమాని ఆగస్టు నెలలో విడుదల చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తుంది.

Post a Comment

0 Comments