About Me

డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న సుమంత్..?

డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న సుమంత్..?


 

హీరో సుమంత్ గతేడాది మళ్ళీ రావా చిత్రంతో డీసెంట్ హిట్ అందుకుని మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు. దీని తరువాత తన కెరియర్ లో ప్రతిష్టాత్మకమైన 25వ చిత్రాన్ని కొద్ది రోజుల క్రితమే మొదలెట్టారు. నూతన దర్శకుడు సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుబ్రహ్మణ్యపురం అని టైటిల్ ఖరారు చేశారు. మొన్ననే ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుండి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ అందుకుంది.

Sumanth comes with different Concept

 

ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే ఆధ్యంతం ఆసక్తిని రేకెత్తిస్తూ థ్రిక్లర్ లా సాగుతుందని తెలుస్తోంది. సుమంత్ పాత్ర ఇందులో నాస్తికుడిగా కాగా తాను ప్రేమించిన అమ్మాయి కోసం, ఓ గ్రామం కోసం ఏకంగా దేవుడితోనే పోరాడతాడు. ఇలాంటి సరికొత్త జోనర్ లో ఈ సినిమా రూపొందుతోంది. సుమంత్ ఇప్పటివరకు ఇలాంటి డిఫెరెంట్ చేయలేదు కాబట్టి మంచి విజయం సాదిస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో సుమంత్ సరసన ఈషా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే యాభై శాతం షూటింగ్ కావడంతో నవంబర్ లో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చుతుండగా, ఆర్కే ప్రతాప్ కెమెరాను హ్యాండిల్ చేస్తున్నాడు. ఈ థ్రిల్లర్ ను ఇంపెక్స్ ఐపీఎల్ బ్యానర్ నిర్మిస్తోంది.

 

Post a Comment

0 Comments