About Me

దాగుడుమూతలు లో ఇంత కిక్ ఉందా.. రేణు

దాగుడుమూతలు లో ఇంత కిక్ ఉందా.. రేణు..?


రేణు దేశాయ్ తన భర్త గురించి బాగా ఊరిస్తోంది. పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న ఇన్నేళ్ల తర్వాత రెండో పెళ్లి చేసుకున్న రేణు దేశాయ్ నిశ్చితార్థం జరిగాక మీడియా ఛానల్ ఇంటర్వ్యూలకు అందుబాటులోకి వచ్చి షాక్ ఇచ్చింది. అభిమానుల కామెంట్స్ భరించలేకపోతున్న అంటూ వాపోతున్న రేణు ఇకపై గుట్టుగా ఉండే సమస్య లేదని తేల్చి చెప్పేస్తోంది.



పవన్ ఫాన్స్ తన విషయంలో హద్దులు మరిచి కాస్త దూకుడుగా వెళ్లినా ఇకపై ఆ ఇష్యూ గురించి మళ్ళి మళ్ళి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవచ్చు. కానీ రేణు దేశాయ్ మాత్రం వాళ్ళను టీజ్ చేయడానికో లేక తనకున్న భావ ప్రకటనను చూపించుకోవడానికో తెలియదు కానీ కొత్త భర్తను నేరుగా చూపించకుండా వెనుక నుంచి అతన్ని దగ్గర తీసుకున్నట్టుగా తాను మాత్రమే కనిపించేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. భుజానికి ఒకవైపు కొంత భాగం తప్ప అతను కనిపించడమే లేదు.


ఇప్పుడు ఈ ఫోటోలు అవసరమా అని కొందరు ప్రశ్నించవచ్చు. అది తన హక్కు. సోషల్ మీడియాలోనే కాదు ఎక్కడైనా తాను అనుకున్నది చెప్పొచ్చు. కానీ ఇలా దోబూచులాటలు కాకుండా ఇదిగో ఇతను నా రెండో భర్త ఇకపై నేను ఈయన సంరక్షణలోనే ఉంటాను అని తెగేసి చూపిస్తే ఓ పనైపోతుంది,. అందరి నోళ్లు మూతపడతాయి కూడా. కామెంట్లు రావడం సహజమే. వాటిని పట్టించుకుంటేనే అసలు సమస్య. వదిలేస్తే ఏ గొడవ లేదు.


విదేశాల నుంచి వచ్చేసి పూణేలో స్థిరపడిన వ్యక్తిని చేసుకోబోతున్న రేణు దేశాయ్ అతని పేరు కూడా క్లూ ఇవ్వడం లేదు. చూస్తుంటే పెళ్లి దాకా ఈ గేమ్ ఇలాగే కొనసాగించేలా ఉంది. స్వేచ్ఛ హక్కు ఉన్నప్పుడు ధైర్యంగా ఫోటో పెట్టొచ్చుగా రేణు అనే ప్రశ్నకు తనే సమాధానం ఇవ్వాలి

Post a Comment

0 Comments