About Me

ఫాన్స్ కి బర్త్ డే గిఫ్ట్ ఇవ్వనున్నా ... మహేష్ ?

ఫాన్స్ కి బర్త్ డే గిఫ్ట్ ఇవ్వనున్నా ... మహేష్ ?


 

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న 25వ సినిమా ప్ర‌స్తుతం ఆన్‌సెట్స్‌ ఉన్న సంగ‌తి తెలిసిందే. వంశీ పైడిప‌ల్లి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అల్ల‌రి న‌రేష్ ఓ కీల‌క‌పాత్ర పోషిస్తున్నారు. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ ఈ సినిమాకి టైటిల్‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించ‌లేదు.

first-look-and-title-launch-on-mahesh-birthday

తాజా స‌మాచారం ప్ర‌కారం... మ‌హేష్ 25 టైటిల్‌పై ద‌ర్శ‌క‌నిర్మాత‌ల్లో త‌ర్జ‌న‌భ‌ర్జ‌న సాగుతోంది. ఫ‌లానా టైటిల్ అని ఇంకా అధికారికంగా క్లారిటీ రాలేదుట‌. అయితే అన్నిటికీ సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే క్లారిటీ వ‌చ్చేస్తుంది. ఆగ‌స్టు 9న మ‌హేష్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అభిమానుల‌కు స్వీట్ షాక్ ఇవ్వాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకుంద‌ని తెలుస్తోంది. ఆరోజు మ‌హేష్ 25 ఫ‌స్ట్‌లుక్ లాంచ్ చేయ‌డ‌మే గాకుండా ఈ సినిమా టైటిల్‌ని వెల్ల‌డించ‌నున్నారు. ఉగాది కానుక‌గా 5 ఏప్రిల్ 2019కి సినిమాని రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నారు. ముంబై బ్యూటీ పూజా హెగ్డే ఈ చిత్రంలో క‌థానాయిక‌గా ఆడిపాడుతోంది. రాక్‌స్టార్‌ దేవీశ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Post a Comment

0 Comments