About Me

ఈ హీరోయిన్ ని తట్టుకోవడం కష్టమే... టాలీవుడ్ ?

ఈ హీరోయిన్ ని తట్టుకోవడం కష్టమే... టాలీవుడ్ ?


 

కొత్త సౌండ్ చెవుల్లో గుయ్‌మ‌నిపిస్తాం..అంటూ గ‌త కొంత‌కాలంగా `ఆర్ఎక్స్ 100 టీమ్` చేస్తున్న ప్ర‌చారం చూస్తే వీళ్లేదో కొత్త‌గా ట్రై చేశార‌నే భావించారంతా. అందుకు త‌గ్గ‌ట్టే టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లోనూ వేడి పెంచారు. ట్రైల‌ర్ చూశాక ఇక ఈ సినిమా చూడాల్సిందేన‌ని ఫిక్స‌వుతారంతా. అయితే సినిమా చూశాక మాత్రం స‌మీక్ష‌కులు పూర్తిగా పెద‌వి విరిచేశారు. ఈ సినిమాలో న‌టించిన హీరోకి గొప్ప భ‌విష్య‌త్ ఉంది. అద్భుతంగా న‌టించాడ‌న్న కితాబుతో పాటు, హీరోయిన్‌ని ఉన్న‌ట్టుండి విల‌న్‌ని చేసి, అప్ప‌టివ‌ర‌కూ ఉన్న ఫీల్‌ని పోగొట్టేశార‌న్న విమ‌ర్శ‌లొచ్చాయి.



అదంతా అటుంచితే ఈ చిత్రంలో న‌టించిన పాయ‌ల్ రాజ‌పుత్ గురించి అంతా ఆసక్తిగా మాట్లాడుకుంటున్నాడు.  `ఆర్ఎక్స్ 100` స‌క్సెస్‌మీట్‌లో అంద‌రినీ డామినేట్ చేసిన పాయ‌ల్ .. సినిమాలో నెగెటివ్ షేడ్ ఉన్న బోల్డ్‌ పాత్ర‌తో అద‌ర‌గొట్టేసింది. ఆరంగేట్ర‌మే ఈ రేంజులో రెచ్చిపోయిందే అంటూ ఒక‌టే ఆస‌క్తిక‌ర‌ చ‌ర్చ సాగింది. పెద‌వి ముద్దులతో ఆద్యంతం వేడి పెంచేసినా.. అస‌లు సినిమా సోల్‌ని దెబ్బ కొట్ట‌డానికి హీరోయిన్‌లోని నెగెటివిటీ కార‌ణం అన్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. తెర‌పై హీరో చొక్కా గుండీలు విప్పి.. లిప్ లాక్‌ల‌తో చెల‌రేగిపోయిన బోల్డ్ బ్యూటీ పాయ‌ల్ వ‌ల్ల సినిమాకి ఏం క‌లిసి రాక‌పోయినా.. త‌న‌కు మాత్రం ఈ సినిమా క‌లిసొస్తుంద‌న‌డంలో సందేహం లేదు.

టాలీవుడ్  దర్శ‌క‌నిర్మాత‌ల గుండెల్లో పాయ‌ల్ గుబులు పుట్టించింద‌న్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. తెర నిండా పెద‌వి ముద్దులు క‌నిపిస్తే, దానినే క‌థ‌లో భాగం చేసేస్తే అది సినిమా ఎలా అవుతుంది? అందుకే ఆర్‌.ఎక్స్ 100ని స‌మీక్ష‌కులు త‌మ‌దైన శైలిలో ఏకేశారు. ఈ సినిమా హీరో- హీరోయిన్‌ల‌కు భ‌విష్య‌త్ ఉంది. అస‌లు ఫ‌లితం ఏంటో సోమ‌వారానికి తేలిపోతుంది.

Post a Comment

0 Comments