About Me

దిల్ రాజు దెబ్బకు గీత గోవిందం వాయిదా...?

దిల్ రాజు దెబ్బకు గీత గోవిందం వాయిదా...?


 

పరిశ్రమలోని నిర్మాతల్లో అల్లు అరవింద్, దిల్ రాజు ఇద్దరూ పెద్దవారే.  ప్రస్తుతం అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ 2 సంస్థలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు హీరో హీరోయిన్లుగా 'గీతా గోవిందం' అనే సినిమాను రూపొందించారు.  ముందుగా ఈ చిత్ర టీజర్ ను రేపు 22  ఆదివారం విడుదలచేయాలని అనుకున్నారు.

allu-aravind-postpones-geetha-govinam-teaser-for-dil-raju

అదే సమయానికి దిల్ రాజు తాను నితిన్, రాశీఖన్నాలు జంటగా నిర్మిస్తున్న 'శ్రీనివాస కళ్యాణం' టీజర్ ను విడుదలచేయాలని ఫిక్సయ్యారు.  దీంతో రెండింటి మధ్య క్లాష్ ఏర్పడే పరిస్థితి తలెత్తడంతో దిల్ రాజు అరవింద్ కు స్వయంగా ఫోన్ చేసి 'గీతా గోవిందం' టీజర్ ను కొంత వాయిదా వేయమని అడిగారట.  దిల్ రాజు మాటని కాదనలేకపోయిన అల్లు అరవింద్ గారు మనసు మార్చుకుని 'గీతా గోవిందం' టీజర్ ను 23కు వాయిదా వేశారట.

Post a Comment

0 Comments