About Me

తెలుగు సంప్రదాయని పరిచయం చేసిన బాలయ్య ..!

తెలుగు సంప్రదాయని పరిచయం చేసిన బాలయ్య ..!


vidya-balan-gets-a-warm-welcome-from-balakrishna

తెలుగు సాంప్రదాయాన్ని, ఆచారాలను గౌరవించడంలో, ఆచరించడంలో హీరో నందమూరి బాలక్రిష్ణ ముందుంటారు. ముఖ్యంగా ఆయన అతిధులను, ఆత్మీయులను ఆహ్వానించే తీరు చాలా గొప్పగా ఉంటుంది. ఆయన ఆతిధ్యాన్ని స్వీకరించిన వ్యక్తులు చాలా కాలంపాటు ఆ మర్యాదల్ని మర్చిపోరు. తాజాగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఆయన అతిధి సత్కారాలను అందుకున్నారు.


బాలక్రిష్ణ స్వయంగా నటిస్తూ, నిర్మిస్తున్న 'ఎన్టీఆర్' చిత్రంలో నందమూరి తారకరామారావుగారి సతీమణి బసవతారకంగారి పాత్రలో విద్యాబాలన్ నటించనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమె ఈరోజు నుండి షూటింగ్ పనుల్లో పాల్గొననున్నారు. ఈ సందర్బంగా బాలక్రిష్ణ, ఆయన సోదరి లోకేశ్వరి విద్యాబాలన్ ను తెలుగు ఆచారం ప్రకారం చీరను బహుకరించి సినిమాలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బాలక్రిష్ణ సతీమణి వసుంధరాదేవి, కుమార్తె తేజస్విని, అల్లుడు శ్రీభరత్ లు కూడ పాల్గొన్నారు.

Post a Comment

0 Comments