About Me

భీష్మ కి లైన్ క్లియర్ చేసిన నితిన్...!

"భీష్మ" కి లైన్ క్లియర్ చేసిన నితిన్...!


 

పిల్ల దొర‌క‌లేదు కానీ అప్పుడే పెళ్లి గురించి ఆలోచిస్తున్నాడు నితిన్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ గా టాలీవుడ్ లో ఉన్న ఈ హీరో ఇప్పుడు పెళ్లి కాన్సెప్ట్ తో వ‌ర‌స సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు మ‌రో విష‌యం ప‌ట్టించుకోకుండా కేవ‌లం క‌ళ్యాణంపైనే ఫోక‌స్ చేసాడు. ఈ మార్చ్ లోనే పెళ్లి ప‌నులు కూడా మొద‌లైపోయాయి. అయితే ఇదంతా రియ‌ల్ పెళ్లి కోసం కాదు లెండీ..! రీల్ పెళ్లి కోస‌మే.

nitin-green-signal-to-bishma-movie

నితిన్ ప్ర‌స్తుతం `శ్రీ‌నివాస క‌ళ్యాణం` చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. `శ‌త‌మానం భ‌వ‌తి` ఫేం స‌తీష్ వేగేష్న ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత నితిన్ సినిమా ఏది? అంటే అందుకు క‌న్ఫ‌ర్మేష‌న్ వార్త అందింది.

ఈ చిత్రం త‌ర్వాత నితిన్ న‌టించే సినిమా ఖ‌రారైంది. `ఛ‌లో` ఫేం వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో కొత్త సినిమా `భీష్మ‌` ఆగ‌స్టులో ప్రారంభం కానుంది. మెహ్రీన్ ఈ చిత్రంలో క‌థానాయిక‌, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో రాధాకృష్ణ నిర్మించ‌నున్నారు. ఆగ‌స్టు 9న `శ్రీ‌నివాస‌క‌ళ్యాణం` రిలీజవుతున్న సంగ‌తి తెలిసిందే.

ఈ చిత్రంలో రాశీఖ‌న్నా, నందిత శ్వేత క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. మిక్కీ.జె సంగీతం అందిస్తుండ‌గా, స‌మీర్ రెడ్డి ఛాయాగ్రహ‌ణం అందిస్తున్నారు. కొత్త సినిమాకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉందింకా. మ‌రోవైపు హ‌రీష్ శంక‌ర్ సినిమాలోనూ నితిన్ న‌టిస్తారని ప్ర‌చార‌మైనా, ఆ ప్రాజెక్ట్ ఇంకా పెండింగులోనే ఉంది.

Post a Comment

0 Comments