About Me

కాలేజీ స్టూడెంట్ గా ఎన్టీఆర్..?

కాలేజీ స్టూడెంట్ గా ఎన్టీఆర్..?


ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో `అర‌వింద స‌మేత` తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈసినిమాలో తార‌క్ రెండు విభిన్న‌మైన షేడ్స్ ఉన్న పాత్ర‌లో న‌టిస్తున్నాడు. రాయ‌ల‌సీమ‌లో వీర‌రాఘ‌వ పాత్ర‌లో, సిటీకి వ‌చ్చాక సిద్ధార్థ్ గౌత‌మ్ పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ట‌. శ‌ర‌వేగంగా షూటింగ్ పూర్త‌వుతోంది. రామోజీ ఫిలింసిటీలో 12 వ‌ర‌కూ .. చిత్రీక‌ర‌ణ సాగించి త‌ర్వాత శంషాబాద్‌కి షెడ్యూల్ షిఫ్ట‌వుతుంది. అటుపై పొల్లాచ్చి- విలేజ్ నేప‌థ్యంలో ఓ పాటను చిత్రీక‌రించ‌నున్నారు. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 12న సినిమాని రిలీజ్ చేయ‌నున్నారు.



ఈ సినిమాలో ఓ స‌ర్‌ప్రైజ్ ఎలిమెంట్ థియేట‌ర్ల‌లో స్పెష‌ల్ ట్రీట్‌నిస్తుంద‌ని చెబుతున్నారు. ఇందులో ఓవైపు వీర‌రాఘ‌వ‌గా ఫ్యాక్ష‌న్ యాక్ష‌న్‌తో మాస్‌ని ట‌చ్ చేసే ఫైట్స్ చేసే ఎన్టీఆర్‌, కాలేజ్ విద్యార్థిగా రొమాంటిక్ యాంగిల్‌లో యూత్‌ని మైమ‌రిపిస్తాడ‌ని తెలుస్తోంది. స్టూడెంట్ నం.1 చిత్రంలో విద్యార్థి పాత్ర‌లో ఎంతో ఎమోష‌న్ పండించాడు తార‌క్‌. హ‌త్య చేసి జైలుకెళ్లే విద్యార్థిగా క‌నిపించి స‌ర్‌ప్రైజ్ చేస్తాడు.


తాజా చిత్రంలో అంత‌కుమించిన స‌ర్‌ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇక‌పోతే త్రివిక్ర‌మ్ చిత్రంలో స్టూడెంట్ పాత్ర పేరు సిద్ధార్థ్‌. ఈ పాత్ర‌కు సంబంధించిన స‌న్నివేశాల్ని శంషాబాద్‌లో చిత్రీక‌రిస్తారుట‌. విద్యార్థిగా క‌నిపించ‌డం కోసమే 20 కేజీల బ‌రువు ఎన్టీఆర్ త‌గ్గాడుట‌. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు.

Post a Comment

0 Comments