About Me

రాజమౌళి తో సినిమాకు "నో" చెప్పిన సమంత...?

రాజమౌళి తో సినిమాకు "నో" చెప్పిన సమంత...?


 

Samantha rejects rajamouli offer

 

ఈ ఏడాది 'రంగస్థలం, అభిమన్యుడు, మహానటి' వంటి సినిమాలతో భారీ హిట్లను అందుకున్న సమంత తన స్టార్ స్టేటస్ ను ఎప్పటికప్పుడు నిలుపుకుంటూ వస్తున్నారు.  ప్రస్తుతం 'యు టర్న్' అనే ద్విభాషా చిత్రంతో పాటు 'సీమరాజ, సూపర్ డీలక్స్' వంటి రెండు తమిళ చిత్రాల్ని చేస్తున్న సమంతకు ఒక భారీ ఆఫర్ వచ్చిందట.

అదే రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో రాజమౌళి చేస్తున్న మల్టీ స్టారర్ ఆఫర్.  స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమాలో ఒక కీ రోల్ ఉందని, అందులో నటించమని రాజమౌళి సమంతను అడిగారట.  కానీ చేతిలో వరుస సినిమాలు ఉండటం, త్వరలో నాగ చైతన్యతో కలిసి కొత్త సినిమాను చేయాల్సి ఉండటంతో సమంత జక్కన్న ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారని ఫిల్మ్ నగర్ టాక్.   మరి ఈ వార్తలో ఎంత వాస్తవముందో తెలియాలంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ అందేవరకు ఆగాల్సిందే.

Post a Comment

0 Comments