About Me

శూర్పణఖ పాత్రలో కాజల్..?

శూర్పణఖ పాత్రలో కాజల్..?


 

ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా వెలుగొందిన కాజల్.. కొంతకాలం సినిమా ఇండస్ట్రీలో పెద్ద సినిమా ఆఫర్లు లేక చిన్న సినిమాలు చేసింది.  ఆ తరువాత ఈ అమ్మడు తిరిగి ఫామ్ లోకి వచ్చి.. భారీ చిత్రాలను చేజిక్కించుకుంటున్నది.  మగధీరలో యువరాణి పాత్రలో కాజల్ మెరుపులు మెరిపించిన సంగతి తెలిసిందే.  ఇలాంటి పాత్రలోనే మరోసారి మెరిసేందుకు సిద్ధమౌతోంది ఈ చందమామ.

kajal-agarwal-to-play-soorpanaka-role

హిందూ పురాణంలో రామాయణానికి ఓ ప్రాధాన్యత ఉన్నది.  ఇందులో లంకాధీశుడు రావణాసురుడు అనగానే మనకు భయంకరమైన రూపం కళ్ళముందు మెదులుతుంది.  ఇక, రామరావణ యుద్దానికి ప్రధాన కారణమైన రావణ సోదరి శూర్పణక గురించి చాలా మందికి తెలియదు.  శూర్పణక అనగానే ఓ రాక్షసి అనుకుంటారు.  కానీ, శూర్పణకలో కూడా ఓ అందాల యువరాణి దాగుంది.  ఆ అందాల యువరాణి పాత్రను ఆధారంగా చేసుకొని భార్గవ్ అనే దర్శకుడు సినిమా చేయబోతున్నాడు.  దీనికి సంబంధించిన వివరాలను అధికారికంగా త్వరలోనే ప్రకటిస్తారు.

Post a Comment

0 Comments