About Me

ఎన్టీఆర్ అభిమానుల‌కు బిగ్ షాక్...?

ఎన్టీఆర్ అభిమానుల‌కు బిగ్ షాక్...?


యంగ్‌య‌మ ఎన్టీఆర్ అభిమానుల‌కు బిగ్ షాక్ ఇవ్వ‌నున్నారా? అంటే అవున‌నే స‌మాచారం. ఇక‌మీద‌ట ఎన్టీఆర్‌ని నేరుగా సామాజిక మాధ్య‌మాల్లో క‌లుసుకుని ముచ్చ‌ట్లాడే ఆస్కారం లేనేలేదు. ఎందుకంటే ఆర్నెళ్లు సోష‌ల్ మీడియాలు బంద్ చేసి డిజిట‌ల్‌కి దూరంగా ఉండ‌నున్నరుట‌.ఈ విష‌యాన్ని తార‌క్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు.

big-shock-to-ntr-fans

ఓ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మంలో మీడియాతో మాట్లాడిన తార‌క్ ఈ విష‌యంపై చెబుతూ.. 3 నెల‌ల పాటు డిజిట‌ల్ డిటాక్స్ ట్రీట్‌మెంట్ కొన‌సాగ‌నుంద‌ని, అందుకని డిజిట‌ల్‌(ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వ‌గైరా)కి దూరంగా ఉంటున్నాన‌ని తెలిపారు. 

ఎన్టీఆర్‌కి ట్విట్ట‌ర్‌లో 24ల‌క్ష‌ల ఫాలోవ‌ర్స్,  ఇన్‌స్టాగ్ర‌మ్‌లో 26ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు. అంటే వీళ్లంద‌రికీ ఇక తార‌క్ వ్య‌క్తిగ‌త‌, వృత్తిగ‌త స‌మాచారం సామాజిక మాధ్య‌మంలో తెలిసే అవ‌కాశ‌మే లేద‌న్న‌మాట‌. చికిత్స‌లో భాగంగా 3- 6 నెలలు వీట‌న్నిటికీ దూరంగా ఉంటున్నారు. ఇది నిజంగానే అభిమానుల‌కు బిగ్ షాక్ అనే చెప్పాలి.

 

Post a Comment

0 Comments