About Me

జగన్ చేతుల మీదుగా టీజర్ లాంచ్...?

జగన్ చేతుల  మీదుగా టీజర్ లాంచ్...?


 

కమెడియన్ పృథ్వీ రాజ్ వరుసగా మంచి సినిమాల్లో ప్రేక్షకులు మెచ్చే పాత్రలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ కమెడియన్ హీరో గా మై డియర్ మార్తాండం సినిమాను చేశారు. నూతన దర్శకుడు కేవీ హరీష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 30 రోజుల్లో లాయర్ అయ్యి కోర్టులో కేసులను ఎలగెలిపించాడనే ఆసక్తికర కథతో రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా లాయర్ గెటప్ లో పృథ్వీ అలరించాడు.

ys-jagan-to-release-prithvi-rajs-my-dear-marthandam-movie-teaser

త్వరలోనే ఈ సినిమా టీజర్ ను ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైస్ జగన్ చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నారు. ఈ మధ్యనే ప్రిథ్వి రాజ్  వైస్సార్సీపీ పార్టీకి తన మద్దతును తెలిపి జగన్ తో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు.

అలాగే ప్రస్తుతం జగన్ చేస్తున్న పాదయాత్రలో కూడా పాల్గొన్నారు. సో ఈ నేపథ్యంలో తాను హీరోగా చేసిన సినిమా టీజర్ ను జగన్ తో రిలీజ్ చేయించాలని ప్లాన్ చేశారట. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశముంది. మజిన్ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగష్టు నెలలో రిలీజ్ కానుంది.

Post a Comment

0 Comments