About Me

నీవేవరో రిలీజ్ డేట్ ఫిక్స్...?

నీవేవరో రిలీజ్ డేట్ ఫిక్స్...?


ఆది పినిశెట్టి, స్టార్ హీరో సినిమాల్లో మంచి మంచి పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను బాగా అలరిస్తున్నారు. ఇటు హీరోగా కూడా సినిమాలు చేసుకుంటూ తన మార్కెట్ ని పెంచుకుంటున్నారు. ఆది పినిశెట్టి తాజాగా నీవేవరో సినిమాను చేశారు. తాజాగానే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.



ఈ సినిమాలో ఆది పినిశెట్టి అంధుడిగా చెఫ్ పాత్రలో కనిపించనున్నాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా సాగుతున్నప్పటికీ మధ్యలో క్రైమ్ పార్ట్ కూడా ఉండనుంది. హరినాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ పనులను చేస్తూనే, ప్రమోషన్స్ ను వేగవంతగా చేయనున్నారు.


ఈ సినిమాను ఆగష్టు 24న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో మూడు నగరాలు..రెండు ప్రేమ కథలు..ఒక్క సంఘటన ఇలా ఆసక్తికరంగా టీజర్ సాగడంతో బాగా ఆకట్టుకుంది. ఆది సరసన తాప్సి, రితికా సింగ్ లు హీరోయిన్స్ గా నటించారు. ఈ థ్రిల్లర్ MVV సినిమా బ్యానర్ మరియు కోనా ఫిలిం కార్పొరేషన్స్ నిర్మించాయి.

Post a Comment

0 Comments