About Me

పాటతో వస్తున్న విజయ్ దేవరకొండ

పాటతో వస్తున్న విజయ్ దేవరకొండ..!


 

యువ హీరో విజయ్ దేవరకొండ వరుసగా చేసిన సినిమాల్లో గీత గోవిందం ఒకటి. పరుశురాం దర్శకత్వంలో తెరకెకెక్కిన ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందింది.  ఇదివరకే షూటింగ్ మొత్తం పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా గడుపుతోంది. మొన్ననే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. మేడమ్ నా వయసు 25 స్టిల్ వర్జిన్ అంటూ వైవిధ్యంగా యువతను ఆకట్టుకుంది ఈ పోస్టర్.

Geetha Govindam First Track Release Poster

 

ఇది ప్రమోషన్స్ ను వేగవంతం చేసే నెపంలో ఈనెల 10న సినిమాలోని మొదటిపాటైన ఇంకేం ఇంకేం ఇంకేం కావాలె ను రిలీజ్ చేయనున్నారు. విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. గోపిసుందర్ సంగీతం సమకూర్చారు. ఆగష్టు 15న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న తరుణంలో త్వరలోనే టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మితమైంది. విజయ్ దేవరకొండ ఇదే కాకుండా టాక్సీ వాలా, నోటా సినిమాలను కూడా సిద్ధం చేస్తున్నాడు. త్వరలోనే ఆ సినిమా రిలీజ్ డేట్ వివరాలు తెలిసే అవకాశం ఉంది.

 

Post a Comment

0 Comments