About Me

దర్శకుడే నాకు అన్ని అంటున్న " అనుపమ "..?

దర్శకుడే నాకు అన్ని అంటున్న " అనుపమ "..?


భాషరాని హీరోయిన్లతో దర్శకులు పడే ఇబ్బంది మామూలుగా ఉండదు. గ్లామర్‌ కోసం పరభాష నాయికలను తీసుకుంటున్న ప్రతి దర్శకులు ఈ ఇబ్బందులు చవిచూస్తున్నారు. సెట్లో హీరోయిన్లకు డైలాగ్‌లు చెప్పించే బాధ్యతను అసిస్టెంట్లకు అప్పజెబుతుంటారు. వారికి అదే డ్యూటీ. డైలాగ్‌లు పలకడం, దాన్ని భావాన్ని విడమర్చి చెబుతూ ఎక్స్‌ప్రెషన్స్‌ ఎలా ఉండాలో వివరిస్తుంటారు. నటన పట్ల కమిట్‌మెంట్‌ ఉన్న నాయికలైతే త్వరగానే భాషలను అర్థం చేసుకుంటారు.చిన్న చిన్న మాటలు నేర్చుకుంటారు. అలా నేర్చుకున్న వారిలో అనుపమ పరమేశ్వరన్‌ ఒకరు. అనుపమ ఇప్పుడు తన పాత్రకు తానే తెలుగులో డబ్బింగ్‌ చెబ్బుకునే స్థాయిలో తెలుగు నేర్చుకుని ఆశ్చర్యపరుస్తోంది.

అనుపమకు ఇది ఎలా సాధ్యమైంది? అంటే ఇదంతా దర్శకుడు త్రివిక్రమ్‌ చలువ అని అంటోంది. అ ఆ సినిమాలో నటిస్తున్నపుడు త్రివిక్రమ్‌ ఓర్పుతో ప్రతి వ్యాఖ్యాన్ని విడమర్చి చెప్పేవారట. అలా నెమ్మదిగా తెలుగు నేర్చుకున్నాను అని చెప్పింది. ఒకవైపు దర్శకత్వం చేస్తూనే మరోవైపు హీరోయిన్‌కు తెలుగు నేర్పిన త్రివిక్రమ్‌ అభినందనీయుడు.

తెలుగు సినిమాల్లో నటిస్తున్న తెలుగేతర నాయికలు అనుష్క, తమన్నా, కాజల్‌, ఛార్మి, సాయి పల్లవి వంటి నాయికలు సైతం తెలుగులోనే మాట్లాడుతున్నారు. మన భాషను వాళ్ళు త్వరగా అర్థం చేసుకున్నారు. నేర్చుకున్నారు

Post a Comment

0 Comments