About Me

సాయిధరమ్ తో జోడికట్టిన సునీల్...?

సాయిధరమ్ తో జోడికట్టిన సునీల్...?


సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ వరుస అపజయాలతో కెరియర్ ని కాస్త పక్కదారి పట్టించాడు. ఈ హీరో త్వరలోనే కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎంటర్ టైన్మెంట్ ప్రధానాంశంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రముఖ కమెడియన్ సునీల్ నటించనున్నాడని తెలుస్తోంది. సునీల్ హీరోగా కాస్త చతికిల పడటంతో స్టార్ హీరో సినిమాల్లో కమెడియన్ పాత్రలను పోషిస్తున్నాడు.


ఇక ఈ కొత్త ప్రాజెక్టు విషయానికొస్తే కిషోర్ తిరుమల తనదైన శైలిలోనే ఫ్యామిలీ ఎలెమెంట్స్, మంచి కథతో ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారట. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం చిత్రలహరి బార్ అండ్ రెస్టారెంట్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. టైటిల్ తోనే మంచి మార్కులు కొట్టేసేలా కనిపిస్తున్న ఈ చిత్రం సాయి ధరమ్ తేజ్ హిట్టిస్తుందేమో చూడాలి. గతంలో ఈ దర్శకుడు నేను శైలజా, ఉన్నదీ ఒకటే జిందగీ సినిమాలతో మంచి హిట్ అందుకున్నాడు. ఈ ప్రాజెక్టును మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది

Post a Comment

0 Comments