About Me

అసిస్టెంట్ డైరెక్టర్ గా మారుతున్నా వర్మ...?

అసిస్టెంట్ డైరెక్టర్ గా మారుతున్నా వర్మ...?


రామ్ గోపాల్ వర్మ గురించి తెలియని వ్యక్తులు ఉండరు. సినిమాలు తీసినా తీయకపోయినా ఎదో ఒక విషయం మీద ఆయన వార్తల్లో ఉంటూనే ఉంటాడు. వర్మ దగ్గర పనిచేసిన ఎంతోమంది అసిస్టెంట్ దర్శకులు, దర్శకులుగా మారి మంచి విజయాలు సాధించారు. శిష్యులు దర్శకులుగా మారి సాధించిన విజయాలను చూసి వర్మ ఆనందాన్ని అనుభవించిన సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా వర్మ శిష్యుడు అజయ్ భూపతి కొత్తవాళ్లతో ఆర్ఎక్స్ 100 సినిమా చేశాడు. ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్లు రాబడుతున్నది. దీంతో వర్మ శిష్యుడిపై ప్రశంసలు కురిపించాడు.



ఆర్ఎక్స్ 100 టీమ్ కంగ్రాట్స్ చెప్పిన వర్మ, తన శిష్యుడు తీయబోయే నెక్స్ట్ సినిమాకు తనను అసిస్టెంట్ దర్శకుడిగా తీసుకోవాలని చమత్కరించాడు. వర్మ శిష్యుడు అజయ్ భూపతికి బడా బ్యానర్ల నుంచి ఆఫర్లు వచ్చినట్టు కూడా వర్మ వెల్లడించాడు. మొత్తానికి వర్మ తన శిష్యుడిపై అమోఘమైన ప్రేమను కురిపిస్తున్న వర్మ, తన సినిమాలు ఎందుకని హిట్ కాలేకపోతున్నాయో అని మాత్రం ఆలోచించలేకపోతున్నాడు.


ప్రస్తుతం వర్మ.. ముత్తప్పన్ అనే వ్యక్తి జీవితకథ ఆధారంగా రేయ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తరువాత వర్మ ఐస్ క్రీమ్ 3 ని తీస్తానని చెప్తున్నాడు. ఇప్పటికే ఎన్నో సినిమాలు ప్రకటించి ఫస్ట్ లుక్ ను విడుదల చేసి, నిలిపేసిన సినిమాలు వర్మ రూమ్ లో ఎన్నో ఉన్నాయి.. మరి వాటిలాగే ఈ సినిమా కూడా మిగిలిపోతుందా..?

Post a Comment

0 Comments