About Me

వరుణ్ స్పేస్ మూవీ డేట్ ఫిక్స్..!

వరుణ్ స్పేస్ మూవీ డేట్ ఫిక్స్..!


మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ క‌థానాయ‌కుడిగా ఘాజి ఫేం సంక‌ల్ప్‌రెడ్డి రూపొందిస్తున్న తొలి తెలుగు స్పేస్ మూవీ ఎప్పుడు రిలీజ‌వుతుంది? మెగాభిమానులు స‌హా తెలుగు ప్ర‌జ‌లంద‌రిలోనూ ఒక‌టే ఆస‌క్తి. స‌ముద్ర గ‌ర్భంలో జ‌లంత‌ర్గామిపై సినిమా తీసిన సంక‌ల్ప్ మ‌రో ప్ర‌యోగాత్మ‌క కాన్సెప్టుతో బ‌రిలో దిగ‌డంతో అంద‌రిలోనూ ఒక‌టే ఉత్కంఠ నెల‌కొంది. ఈ యంగ్ డైరెక్ట‌ర్ మ‌రోసారి మిరాకిల్స్ చేయ‌డం ఖాయ‌మ‌న్న అంచ‌నాలేర్ప‌డ్డాయి. ఘాజీని మించిన భారీ కాన్వాస్‌తో వ‌రుణ్‌తేజ్ ఈ సినిమాని రూపొందించ‌డం వాడి వేడి చ‌ర్చ‌కు తావిస్తోంది.



అస‌లు ప్ర‌యోగం అంటే ఏంటో తెలియ‌ని... క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు తీసే టాలీవుడ్‌లోనా ఇలాంటి సినిమా తీసేది? అన్న చ‌ర్చ సాగుతోంది. ఈ సినిమా కోసం న‌టీన‌టులు జీరో గ్రావిటీలో శిక్ష‌ణ తీసుకున్నారు. వ‌రుణ్‌, అదితీరావ్ 3డి స్కాన్ టెక్నాల‌జీ శిక్ష‌ణ తీసుకున్నారు.


ఇక భారీ యాక్ష‌న్ కోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణుల గ్రేట్ వ‌ర్క్ చేస్తున్నార‌ని తెలిసింది. అయితే తొలి తెలుగు స్పేస్ మూవీ రిలీజ్ ఎప్పుడు? అన్న ప్ర‌శ్న‌కు తాజాగా స‌మాధానం వ‌చ్చేసింది. ఈ సినిమా రిలీజ్ తేదీ డిసెంబ‌ర్ 21. అయితే నిర్మాత‌లు అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది. ఘాజి స‌క్సెస్ హైప్‌తో ఇప్ప‌టికే బిజినెస్ పూర్త‌యింది. ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రంలో జ్ఞాన‌శేఖ‌ర్ కెమెరా ప‌నిత‌నం మ‌రో హైలైట్‌గా ఉంటుంద‌ని చెబుతున్నారు. ఇందులో లావ‌ణ్య త్రిపాఠి వేరొక పాత్ర‌లో న‌టిస్తోంది.

Post a Comment

0 Comments