About Me

" ఫన్ " మొదలు పెట్టిన వరుణ్...

" ఫన్ " మొదలు పెట్టిన వరుణ్...



ఫిదా, తొలిప్రేమ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టిన వరుణ్ తేజ్ వరుసగా సినిమాలను లైన్లో పెడుతున్నాడు. సంకల్ప్ రెడ్డితో కలిసి అంతరిక్షం నేపథ్యంలో వరుణ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాక ముందే వరుణ్ మరో సినిమాను పట్టాలెక్కించాడు.

విక్టరీ వెంకటేష్‌తో కలిసి ‘ఎఫ్2’ పేరిట ఓ చిత్రంలో ఈ మగా హీరో నటిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ జూన్ మూడో వారంలో లాంఛనంగా ప్రారంభమైంది.

గురువారం ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ మూవీ రెగ్యులర్ షూటింగ్ షురూ అయ్యింది. జూలై 21 వరకు తొలి షెడ్యూల్ చిత్రీకరించనున్నారు. తొలి షెడ్యూల్‌లో వెంకీ, వరుణ్ తేజ్ నటించనున్నారు. వెంకీ సరసన తమన్నా నటిస్తుండగా.. వరుణ్ తేజ్‌కి జంటగా మెహ్రీన్ నటిస్తోంది.

Post a Comment

0 Comments