About Me

షూటింగ్ మొదలుపెట్టిన రాజమౌళి...?

షూటింగ్ మొదలుపెట్టిన రాజమౌళి...?


దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఓ భారీ మల్టీ స్టారర్ రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా గడుపుతున్న ఈ సినిమా షూటింగ్ గురించి గతంలో రకరకాల వార్తలొచ్చాయి.




తాజాగా అందుతున్నసమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుండి మొదలవుతుందని తెలుస్తోంది. మొదటగా ఎన్టీఆర్, రామ్ చరణ్ ల సోలో సీన్స్ ను తెరకెక్కిస్తారట. ఇందుకోసం ఆల్రెడీ భారీ సెట్స్ ను రూపొందించే పనిలో చిత్రబృందం నిమగ్నమైందట.

ఇటు ఎన్టీఆర్, త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేతలో నటిస్తుండగా అటు రామ్ చరణ్, బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. వీరిద్దరి ప్రాజెక్ట్స్ పూర్తయ్యాక ఎలాంటి ఆటంకాలు లేకుండా షూటింగ్ జరుగుతుందట. విజయేంద్ర ప్రసాద్ సమకూర్చిన కథ కావడం, రాజమౌళి దర్శకత్వం వహిస్తుండడంతో ఈ మల్టీ స్టారర్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రాజమౌళి ఈ చిత్రాన్ని గ్రాఫిక్స్ ఎక్కువ లేకుండా సాధారణ సినిమాలాగా తెరకెక్కించనున్నారు. ఈ ప్రాజెక్టును డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ పై దానయ్య నిర్మిస్తున్నారు.

Post a Comment

0 Comments