About Me

RX100 జోరుకు బ్రేకులు లేవు... 4Days కలెక్షన్ ఎంతో తెల్స...?

RX100 జోరుకు బ్రేకులు లేవు... 4Days కలెక్షన్ ఎంతో తెల్స...?




 

ఆరెక్స్ 100 జోరుకి ఇప్పటికైతే బ్రేకులు పడటం లేదు. ఫ్యామిలీస్ కాస్త దూరంగా ఉన్నా యూత్ పట్టం కట్టడంతో మొదటి నాలుగు రోజులు ఆడేసుకుంది. దీనికి తోడు విజేత, చినబాబులు  సెంటిమెంట్ ప్లస్ ఫామిలీ సినిమాలే అయినప్పటికీ ఒకదానికి హీరో ఇమేజ్ మరోదానికి కంటెంట్ ఇలా వేర్వేరు విషయాల్లో వీక్ గా ఉండటం ఆరెక్స్ 100కి ప్లస్ గా మారింది. బోల్డ్ కంటెంట్ తో పాటు హీరోయిన్ పాత్రను ఈ మధ్య కాలంలో ఎవరూ చూపని తరహాలో నెగటివ్ గా చూపడం ప్రేమలో మోసపోయిన యువతను థియేటర్ల వైపు వచ్చేలా చేస్తోంది.

ఈ రోజు నుంచి డ్రాప్ ఉండొచ్చు అనే అంచనాలు ఉన్నాయి కానీ రేపటికి క్లారిటీ రావొచ్చు. అయినా కూడా పెట్టుబడి లెక్కల్లో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ ఖాతాలో పడిపోయిన ఆరెక్స్ 100 టాలీవుడ్ కి కొత్త పాఠం నేర్పింది. నిన్న వంకాయ సైట్ ఊహించినట్టే 5 కోట్ల షేర్ ని సులభంగా దాటేసిన ఆరెక్స్ 100 ఫైనల్ రన్ ముగిసేలోపు అద్భుతాలు చేయొచ్చని ట్రేడ్ టాక్. ఏరియాల వారీగా వసూళ్లు చూద్దాం

నైజామ్ - 2 కోట్ల 42 లక్షలు

సీడెడ్ - 60 లక్షలు

ఉత్తరాంధ్ర - 61 లక్షలు

గుంటూరు - 36 లక్షలు

ఈస్ట్ - 42 లక్షలు

వెస్ట్ - 32 లక్షలు

కృష్ణా - 35 లక్షలు

నెల్లూరు - 12 లక్షలు

తెలుగు రాష్ట్రాలు మొత్తం షేర్ 4 రోజులకు - 5 కోట్ల 20 లక్షలు

ఇది అమ్మిన రేట్ల ప్రకారం చూసుకుంటే మూడింతలు ఎక్కువ షేర్. ఇంకా జోరు కొనసాగుతోంది కాబట్టి 10 కోట్ల మార్క్ ని ఫుల్ రన్ లో ఈజీగా  దాటేసేలా ఉంది. మళ్ళి శుక్రవారం దాకా కొత్త సినిమాల విడుదల లేదు కాబట్టి అప్పటి దాకా ఆరెక్స్ 100 హవానే కొనసాగనుంది. హైదరాబాద్ దేవి 70 ఎంఎం  థియేటర్ లో నాలుగు  రోజులు హౌస్ ఫుల్ కావడం గురించి ఇప్పటికీ ట్రేడ్ షాకవుతూనే ఉంది. ట్విన్  సిటీస్ వసూళ్లు భీభత్సంగా ఉన్నాయి. బిసి సెంటర్స్ లో కాస్త స్లో అయినప్పటికీ మరీఎక్కువ డ్రాప్ అయితే కనిపించడం లేదు. అపోజిషన్ వీక్ గా ఉండటాన్ని ఫుల్  గా వాడేసుకుంటున్న ఆరెక్స్ 100 అర్జున్ రెడ్డి అంత రేంజ్ కాదు కానీ పెట్టుకున్న ఓ మాదిరి అంచనాలు అయితే దాటేసింది అనే చెప్పాలి.

Post a Comment

0 Comments