About Me

రివ్యూ: RX100

రివ్యూ: RX100


RX 100 review


సినిమా పేరు: RX 100

రేటింగ్‌: 2.75/5

నటీనటులు: కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుత్‌, రాంకీ, రావు రమేశ్‌ తదితరులు

సంగీతం: చేతన్‌ భరద్వాజ్‌

నిర్మాత: అశోక్‌ రెడ్డి

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అజయ్‌ భూపతి

కంటెంట్‌ బలంగా ఉన్న సినిమాలు విడుదల అవుతున్న తరుణంలో ‘RX 100’ అంటూ టైటిల్‌తోనే ఆకట్టుకున్నారు దర్శకుడు అజయ్‌ భూపతి. రామ్‌ గోపాల్‌ వర్మ వద్ద శిక్షణ తీసుకున్నారాయన. ‘సాధారణ సినిమాలు చూసేవారు నా సినిమాకు రావద్దు’ అని ఇదివరకు ప్రెస్‌మీట్లలో వెల్లడించారు. దర్శకుడు ఇంత కచ్చితంగా చెబుతున్నాడంటే సినిమాలో ఏదో కొత్తదనం ఉండే ఉంటుంది అని ప్రేక్షకులు అనుకున్నారు. మరి దర్శకుడు చెప్పినట్లుగానే సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? అసలు ‘RX 100’ అంటే ఏంటి? తెలుసుకుందాం.

శివ(కార్తికేయ) చిన్నప్పుడే అమ్మానాన్నలను కోల్పోతాడు. డాడి(రాంకీ)నే తనకు సర్వస్వం. డాడి కూడా శివను కన్నకొడుకులా చూసుకుంటాడు. ఆ ఊరి ప్రెసిడెంట్‌ విశ్వనాథం(రావు రమేశ్‌) వద్ద సహాయకుడిగా పనిచేస్తుంటాడు డాడి. విశ్వనాథం ప్రెసిడెంట్‌ అవ్వడానికి డాడినే మూలకారణం. అయితే ఈ విషయాలన్నీ మర్చిపోయిన విశ్వనాథం డాడికి ఇష్టంలేని పనులు కూడా చేస్తుంటాడు. విశ్వనాథం కూతురు ఇందు(పాయల్‌ రాజ్‌పుత్‌)శివను చూడగానే ఇష్టపడుతుంది. ప్రేమించమని వెంటపడుతుంది. శివకు కూడా ఇందును ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తాడు.

వీరి ప్రేమ విషయం విశ్వనాథానికి తెలుస్తుంది. అప్పటికప్పుడు ఇందును మరొకరికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. పెళ్లైన వెంటనే ఇందు అమెరికా వెళ్లిపోతుంది. ఈ షాక్‌ నుంచి శివ ఎలా తేరుకున్నాడు? ఇందు జ్ఞాపకాలు శివను ఎలా వేధించాయి? ఇందు మళ్లీ తిరిగి వచ్చిందా? లేదా? అన్నదే కథ.

దర్శకుడు అజయ్‌ భూపతి తన గురువు వర్మ లాగే ఒక వాస్తవిక కథను తెరపై చూపించడానికి ప్రయత్నించాడు. నిజ జీవితంలో జరిగిన కథ ఇది. అందుకే సినిమా కూడా వాస్తవిక కోణంలోనే సాగుతుంది. కథను చాలా నిదానంగా ప్రారంభించిన దర్శకుడు తొలి సన్నివేశాలతో కాస్త బోర్‌ కొట్టించాడు. కథానాయిక రాకతో కథ, కథనంలో ఉత్సాహం వస్తుంది. కథానాయిక పాత్ర బోల్డ్‌గా తీర్చిదిద్దాడు. హీరో, హీరోయిన్ల మధ్య సాగిన సుదీర్ఘమైన ముద్దు సన్నివేశాలు, శృంగారపరమైన సన్నివేశాలు చూస్తే ఈ సినిమాలు పెద్దలకు మాత్రమేనా? అనిపిస్తుంది.

దర్శకుడు ప్రతీ విషయాన్ని వివరించి చెప్పాలనుకున్నాడు. చాలా సందర్భాల్లో సన్నివేశాలను పచ్చిగా తీద్దామనుకున్నాడు. అందుకే అవన్నీ సుదీర్ఘంగా సాగి విసుగు తెప్పిస్తాయి. ద్వితీయార్థం చూస్తే ‘అర్జున్‌ రెడ్డి’ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కథానాయకుడు సైకోగా మాట్లాడుతున్నాడా? అన్న అనుమానం వస్తుంది. సినిమా మరో 20 నిమిషాల్లో ముగుస్తుందనగా ఊహించని మలుపులు ఇచ్చాడు దర్శకుడు. అక్కడి నుంచి కథ జోరందుకుంటుంది. పతాక సన్నివేశాలు మరింత రియలిస్టిక్‌గా తీర్చిదిద్ది ఈ కథను విషాదాంత కోణంలో ముగించాడు. ఓ విధంగా చెప్పాలంటే చివరి 20 నిమిషాలే ఈ కథను నడిపించాయి. వాటిని నమ్ముకునే దర్శకుడు ఈ కథ రాసుకుని ఉండొచ్చు. ప్రేమకథా చిత్రాల్లో ఇలాంటి కోణం చూడటం చాలా అరుదు. కాబట్టి ఆ మలుపు ముగింపు కాస్త విభిన్నంగానే అనిపిస్తాయి.

రావు రమేశ్‌ పాత్ర ఒకటి, రెండు సన్నివేశాల్లో మెప్పిస్తుంది. నేపథ్య సంగీతం, పాటలు, ఛాయాగ్రహణం ఇవన్నీ సినిమాకు కలిసొచ్చాయి. దర్శకుడు కథ, కథనాల విషయంలో వాస్తవికతను అనుసరించాడు. కాబట్టి అక్కడక్కడ సాగదీతగా అనిపించే సన్నివేశాలు కనిపిస్తాయి. ద్వితీయార్థంలో వచ్చే ట్విస్ట్‌ వరకు కథలో వేగం కనపడదు. ఆ ములుపుని ప్రేక్షకులు ఎంత వరకు ఒప్పుకొంటారో? అన్న దానిమీదే ఈ సినిమా జయాపజాలు ఆధారపడి ఉన్నాయి.

Post a Comment

7 Comments

 1. What's up everybody, here every person is sharing these knowledge, so it's nice to read this web site, and I
  used to pay a quick visit this weblog every day. http://szxljy.net/go.php?u=http://www.mbet88vn.com

  ReplyDelete
 2. What's up everybody, here every person is sharing these knowledge,
  so it's nice to read this web site, and I used to pay a quick visit this weblog
  every day. http://szxljy.net/go.php?u=http://www.mbet88vn.com

  ReplyDelete
 3. Ahaa, its pleasant dialogue on the topic of this paragraph here at
  this web site, I have read all that, so at this time me also commenting at this place. http://alternatif188bet.com

  ReplyDelete
 4. Ahaa, its pleasant dialogue on the topic of this paragraph here at this web site, I have read all that, so at this time me also commenting
  at this place. http://alternatif188bet.com

  ReplyDelete
 5. Hi, I do believe this is a great website. I stumbledupon it ;) I'm going to return yet again since
  i have book-marked it. Money and freedom is the best way to change, may
  you be rich and continue to guide others. http://cptool.com/details/?url=http://alternatif188bet.com

  ReplyDelete
 6. Hi, I do believe this is a great website. I stumbledupon it ;
  ) I'm going to return yet again since i have book-marked it.
  Money and freedom is the best way to change, may you be rich and continue to guide others. http://cptool.com/details/?url=http://alternatif188bet.com

  ReplyDelete
 7. If you find yourself serious about a new profession as a paralegal,
  there are a number of choices which youll consider. You might resolve that being a contract
  paralegal is the way in which that you just wish to pursue this field.
  You possibly can start by weighing the pros and cons of this
  exciting new manner of working within the paralegal area; and you could decide
  that its the most suitable choice for you.

  ReplyDelete