About Me

అరవింద సమేతలో 4 పాటలేనట...!

అరవింద సమేతలో 4 పాటలేనట...!


ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో 4 పాటలే ఉన్నాయని తెలుస్తోంది ఎందుకంటే నాలుగు పాటల తాలూకు వివరాలతో కూడిన ట్రాక్ లిస్ట్ ని సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ ట్వీట్ చేయడంతో షాక్ అవుతున్నారు . ఎన్టీఆర్ సినిమాలో నాలుగు పాటలే ఉండటం ఏంటి ? అని షాక్ అవుతున్నారు అభిమానులు . ఇప్పటికే మాస్ ని మెప్పించేలా పాట లేదని బాధపడుతున్న వాళ్లకు ఇది నిజంగా ఆశ్చర్యానికి గురిచేసే విషయమే మరి . తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే .
ఇక ట్రాక్ లిస్ట్ ప్రకారం నాలుగు పాటలు ఇలా ఉన్నాయి . మొదటి పాటగా ఏడ పోయినాడో , రెండో పాట అణగనగనగా మూడో పాటగా పెనీవిటి , నాలుగో పాటగా రెడ్డి ఇక్కడ సూడు . ఈ నాలుగు పాటల వివరాలతో కూడిన ట్రాక్ లిస్ట్ ని సోషల్ మీడియాలో పెట్టేసాడు తమన్ . ఇక రేపు అరవింద సమేత వీర రాఘవ చిత్రంలోని పాటలన్ని నేరుగా మార్కెట్ లోకి విడుదల కానున్నాయి ఎటువంటి ఫంక్షన్ లేకుండా . అయితే విడుదలకు ముందు మాత్రం గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయనున్నారు . ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటించగా అక్టోబర్ 11న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు 

Post a Comment

0 Comments