About Me

సుధీర్‌కి మ‌హేష్ అండ‌

సుధీర్‌కి మ‌హేష్ అండ‌  


యువ‌హీరో సుధీర్ బాబు సొంతంగా ప్రొడ‌క్ష‌న్ హౌస్ 

ప్రారంభించి అందులో న‌వ‌త‌రం ద‌ర్శ‌కుల్ని ఎంక‌రేజ్ చేస్తూ సినిమాలు తీస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే ఎస్‌బి ప్రొడ‌క్ష‌న్స్‌లో తొలి ప్ర‌య‌త్నంగా `న‌న్ను దోచుకుందువ‌టే` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుధీర్‌బాబు హీరోగా న‌టిస్తూ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 21న రిలీజ‌వుతోంది. ల‌ఘు చిత్రాల ద‌ర్శ‌కుడు ఆర్‌.ఎస్‌.నాయుడుకి ద‌ర్శ‌కుడిగా తొలి ఛాన్స్ ద‌క్కింది. ఇక సుధీర్ సొంత ప్రొడ‌క్ష‌న్ కావ‌డంతో మ‌హేష్ నుంచి కావాల్సినంత స‌పోర్ట్ ద‌క్కుతోంది.

తాజాగా మ‌హేష్ స్వ‌యంగా న‌న్ను దోచుకుందువ‌టే ట్రైల‌ర్‌ని ట్వీట్ చేసి, చాలా బావుంద‌ని ప్ర‌శంసించారు.“ప్రొడ్యూస‌ర్‌గా మొద‌టి ప్ర‌య‌త్నానికి శుభాకాంక్ష‌లు. ట్రైల‌ర్ ప్రామిస్సింగ్‌గా ఉంది. ఆల్ ది బెస్ట్. సెప్టెంబ‌ర్ 21న సినిమా థియేట‌ర్ల‌లోకి రిలీజ‌వుతోంది“ అని తెలిపాడు. మ‌హేష్ నుంచి ఈమాత్రం స‌పోర్టు స‌రిపోదూ సుధీర్ ప్రొడ‌క్ష‌న్ స‌క్సెస్ కావ‌డానికి. పైగా ట్రైల‌ర్‌కి స్పంద‌న బావుంది. ఇందులో సుధీర్ ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా న‌టిస్తున్నాడు. ప్రేమ‌లో దోబూచులాట కాన్సెప్టు ఆక‌ట్టుకుంది. ఇంత స‌పోర్టు ద‌క్కింది కాబ‌ట్టి ఆర్‌.ఎస్‌.నాయుడి తొలి ప్ర‌య‌త్నం స‌క్సెస్ ద‌క్కుతుంద‌నే ఆశిద్దాం.




Post a Comment

0 Comments