About Me

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ముల్టీస్టారర్ తో వస్తున్నాడా...?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ముల్టీస్టారర్ తో వస్తున్నాడా...?


ప్ర‌స్తుతం మ‌ల్టీస్టార‌ర్ల ట్రెండ్ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ కోవ‌లోనే రామ్ క‌థానాయ‌కుడిగా ఓ మ‌ల్టీస్టార‌ర్‌కి స‌న్నాహాలు సాగుతున్నాయి. రామ్ పెద‌నాన్న స్ర‌వంతి ర‌వికిషోర్ ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తార‌ని తెలుస్తోంది. తెలుగు, త‌మిళ్ ద్విభాషా చిత్రంగా దీనిని తెర‌కెక్కించే ఆలోచ‌న ఉంది. అంటే రామ్‌తో పాటు అటు తమిళ హీరో ఈ చిత్రంలో న‌టిస్తారా? అన్న‌ది తెలియాల్సి ఉందింకా.


ప్ర‌స్తుతం క‌థా చ‌ర్చ‌ల‌తో పాటు, ప్రీప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు సాగుతున్నాయి. రామ్ న‌టిస్తున్న తాజా చిత్రం `హ‌లో గురు ప్రేమ‌కోస‌మే` పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పూర్తి చేసుకుని వ‌చ్చే నెల‌లో రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఆ క్ర‌మంలోనే మ‌ల్టీస్టార‌ర్ వివ‌రాల్ని రివీల్ చేస్తార‌ని తెలుస్తోంది. `హ‌లో గురు ప్రేమ‌కోస‌మే` చిత్రానికి రాక్ స్టార్ దేవీశ్రీ సంగీతం అందిస్తున్నారు. ఇదివ‌ర‌కూ రామ్‌కి జ‌గ‌డం, రెడీ, నేను శైల‌జ‌, వున్న‌ది ఒక్క‌టే జింద‌గీ చిత్రాల‌కు సంగీతం అందించిన దేవీశ్రీ మ‌రోసారి రామ్‌కి అద్భుత‌మైన ట్యూన్స్ రెడీ చేస్తున్నార‌ట‌. త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు.

Post a Comment

0 Comments