About Me

ఇటలీలో ఎన్టీఆర్.. వైరల్ పిక్..?

ఇటలీలో ఎన్టీఆర్.. వైరల్ పిక్..?




ఈ స్టిల్ చూశారా.. చెట్టుకింద కూర్చొని ఎన్టీఆర్ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఇది అరవింద సమేత మూవీ స్టిల్ కాదు. ఆ సినిమాకు సంబంధించి వర్కింగ్ స్టిల్. ఈ సినిమా షూటింగ్ కోసం యూనిట్ మొత్తం ఇటలీ వెళ్లిన సంగతి తెలిసిందే. పూజా హెగ్డే, ఎన్టీఆర్ మధ్య ఓ సాంగ్ షూట్ చేశారు. ఈ సందర్భంగా షూటింగ్ గ్యాప్ లో యూనిట్ కు దూరంగా వెళ్లి, చెట్టు కింద ఎన్టీఆర్ కూర్చున్న స్టిల్ ఇది. ఈ ఫొటోకు పెద్దగా నేపథ్యం లేదు. కానీ ఫొటో బాగుండడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అరవింద సమేత చిత్రానికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న ఇటలీ షెడ్యూల్ లో పూజా హెగ్డే షూటింగ్ పోర్షన్ కంప్లీట్ అయింది. ఈ విషయాన్ని పూజా హెగ్డే స్వయంగా ట్వీట్ చేసింది. సినిమాకు సంబంధించి తన షూటింగ్ మొత్తం పూర్తయిందని, యూనిట్ ను మిస్ అయినందుకు చాలా బాధగా ఉందని వీడియో పోస్ట్ చేసింది.

ఇటలీ షెడ్యూల్ లో సాంగ్ షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం ఎన్టీఆర్ పై కొన్ని మాంటేజ్ షాట్స్ తీస్తున్నారు. మరో 2 రోజుల్లో యూనిట్ మొత్తం ఇండియాకు తిరిగి వచ్చేస్తుంది. ఆ వెంటనే ప్రీ-రిలీజ్ ఫంక్షన్ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారు. దసరా కానుకగా థియేటర్లలోకి రానుంది అరవింద సమేత చిత్రం.

Post a Comment

0 Comments