About Me

రష్మిక తో రొమాన్స్ చేయనున్న నితిన్

రష్మిక తో రొమాన్స్ చేయనున్న నితిన్...!



ఈ ఏడాది “చల్ మోహన్ రంగ” “శ్రీనివాస కళ్యాణం” సినిమాలతో ఫ్లాప్స్ ని అందుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర డీలా పడిపోయాడు నితిన్. ప్రస్తుతం నితిన్ కి ఒక హిట్ అవసరం. అందుకే “ఛలో” తో నాగ శౌర్య ని హిట్ ట్రాక్ లోకి తెచ్చిన వెంకీ కుడుముల తో తన తదుపరి సినిమాని చెయ్యబోతున్నాడు నితిన్. “భీష్మ” అనే టైటిల్ పెట్టుకున్న ఈ సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ లో ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పై ఎస్.నాగ వంశీ ఈ “భీష్మ” ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక ని తీసుకోవాలి అని డైరెక్టర్ కి సూచిస్తున్నాడట నితిన్. రష్మిక ఇప్పటికే “ఛలో” “గీత గోవిందం” సినిమాలతో హిట్స్ అందుకొని దూసుకుపోతుంది. అందుకే ఈ హిట్ హీరోయిన్ తన సినిమాలో కూడా ప్లస్ పాయింట్ అవుతుంది అని నితిన్ ఆలోచన.

ఇదిలా ఉంటే రష్మిక నటిస్తున్న “దేవదాస్” సినిమా ఈ నెల 27 న రిలీజ్ కి రెడీ అవుతుంది.


Post a Comment

0 Comments