About Me

స్పోర్ట్స్ కు సంబంధించిన కథతో #RRR సినిమా..!

స్పోర్ట్స్ కు సంబంధించిన కథతో #RRR సినిమా..!

ఆర్ఆర్ఆర్ మూవీ నిన్ననే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది.  ఈ సినిమా కోసం కోకాపేటలో నిర్మించిన భారీ సెట్స్ లో షూటింగ్ ప్రారంభించారు.  ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ ల మధ్య షూట్ చేశారు.  మొదటి పదిరోజులు ఎన్టీఆర్, రామ్ చరణ్ ల మధ్య షూట్ చేస్తారని ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఇందులో ఎన్టీఆర్ కొద్దిగా లావుగా భీకరాకృతితో కనిపిస్తుంటే.. రామ్ చరణ్ మాత్రం జుట్టు పెంచి కొత్త మేకోవర్ తో కనిపిస్తున్నారట.  

ఈ సినిమా కథ గురించి ఓ ప్రచారం జరుగుతున్నది. నిన్నటి వరకు ఇది పీరియాడికల్ స్టోరీ అని ప్రచారం జరిగితే.. ఇప్పుడు స్పోర్ట్స్ స్టోరీకి సంబంధించిన కథతో సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం.  సూపర్ స్టైలిష్ హకీమ్ ఆలీ ఈ సినిమాలో ఇన్వాల్వ్ కావడంతో ఈ విధమైన అనుమానాలు వస్తున్నాయి.  నితిన్ సై సినిమాకు హకీమ్ ఆలీ హెయిర్ స్టైలిస్ట్ గా వ్యవహరించారు.  ఇప్పుడు హకీమ్ ఆలీని రాజమౌళి సంప్రదించడం.. షూటింగ్ మొదటిరోజు హకీమ్ ఆలీ సెట్స్ లో సందడి చేయడంతో.. స్పోర్ట్స్ కు సంబంధించిన కథతో సినిమా తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతున్నది

Post a Comment

0 Comments